మెరిసే దంతాలకోసం..


Tue,March 19, 2019 11:45 PM

మీ పేస్ట్‌లో ఉప్పున్నా.. ఇంకేం ఉన్నా.. దంతాలు మెరువాలంటే బ్రషింగ్ ఒక్కటి సరిపోదు. మరికొన్ని చిట్కాలు పాటించినప్పుడే ముత్యాల్లాంటి పళ్లు మీ సొంతమవుతాయి.
teeth
-స్ట్రాబెరీల్లో దంతాలను శుభ్రం చేసే గుణం ఉంటుంది. కాబట్టి వాటిని నమిలి తిన్నా కూడా దంతాలు శుభ్రపడుతాయి. స్ట్రాబెర్రీలోని గింజలు పళ్లపై ఉన్న పచ్చదనాన్ని తొలిగించి మెరిసేలా చేస్తాయి.
-చిన్నా చెంచాతో ఉప్పు తీసుకొని అందులో రెండు, మూడు చుక్కల నిమ్మరసాన్ని కలుపాలి. ఈ మిశ్రమంతో దంతాలను తోమడం వల్ల కూడా దంతాలు మిలమిలా మెరుస్తాయి.
-బేకింగ్‌సోడాను చిగుళ్లకు అంటకుండా కేవలం దంతాల మీదనే రుద్ది.. ఒక నిమిషం ఉంచి చల్లని నీటితో పుక్కిలిస్తే సరిపోతుంది. దంతాలు తెల్లగా మారుతాయి.
-అరటింపడు, నారింజ పండు తొక్కలతో పళ్లు తోమాలి. కాసేపటి తర్వాత నీళ్లతో పుక్కిలించి బ్రష్ చేయాలి. ఈ పండ్ల తొక్కలో ఉండే మెగ్నిషియం, పొటాషియం, మాంగనీస్ ఎనామిల్‌కు రక్షణగా ఉంటాయి.
-చెంచా కొబ్బరినూనెను తీసుకొని పదిహేను నిమిషాల పాటు నోట్లోనే ఉంచి ఆ తర్వాత పుక్కిలించాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకొని వెంటనే రెండు గ్లాసుల నీరు తాగాలి. కొబ్బరినూనెలోని లారిక్ ఆమ్లం దంతాలపై పసుపుదనానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపచేస్తుంది.

644
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles