డబుల్ ధమాకా!


Tue,March 19, 2019 11:46 PM

ఒకరి వయసు 56 యేండ్లు. మరొకరి వయసు 28 యేండ్లు. అయినా పోటీపడి చదివారు. ఇద్దరికీ ఒకేరోజు పీహెచ్‌డీ పట్టా వచ్చింది. ఇంతకీ వీరెవరు. ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా?
mala-datta
వీరిద్దరి పేర్లు మాలా దత్త, శ్రేయా మిశ్రా. తల్లికూతుర్లు. ఇద్దరికీ చదువంటే ప్రాణం. తల్లి మాలాదత్తా కాలేజీ చదువులు పూర్తి చేసి దాదాపు 34 యేండ్లు అవుతుంది. అయితేనేం చదవాలన్న కోరిక ఆమెను విడనీడలేదు. 34 యేండ్ల తర్వాత పీహెచ్‌డీ డిగ్రీ పొందింది. ఇదిలా ఉంటే ఆమెకు సంతోషాన్నిచ్చే మరో వార్త ఏంటంటే తన కూతురు కూడా పీహెచ్‌డీ చేసి ఇద్దరూ ఒకేరోజున ఒకే యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ డిగ్రీ పొందారు. 1985లో మాలాదత్త ఆర్థిక శాస్త్రంలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఇక అప్పటినుంచి ఆమెకు పీహెచ్‌డీ చేయాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. కూతురు శ్రేయా ఇంటర్మీడియట్ పరీక్షల కారణంగా ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ఢిల్లీ యూనివర్సిటీలో సైకాలజీలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసింది. శ్రేయా ప్రపంచబ్యాంకులో కన్సల్టెంట్‌గా పనిచేసింది. ఆమె మాస్టర్స్ పూర్తి అయిన రెండేండ్లకు ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసింది. తల్లికూతుర్లు ఒకేసారి పీహెచ్‌డీ పూర్తి చేసి దాన్ని మధుర జ్ఞాపకంగా జీవితాంతం ఉంచుకోవాలని భావించారు. సబ్టెక్టులువేర్వేరు అయినప్పటకీ తల్లి దగ్గర గైడెన్స్ తీసుకొని మరీ చదివింది శ్రేయా. మూడేండ్లలో పీహెచ్‌డీ డిగ్రీ పూర్తి చేశారు. కన్వొకేషన్ రోజు దత్తా మాట్లాడుతూ నా కూతురు నన్ను ఎంతో ప్రోత్సహించింది. కూతురి వయసున్న విద్యార్థులతో చదివినందుకు నేను ఎంతో నేర్చుకున్నాను. ప్రొఫెసర్స్ నన్ను మ్యామ్ అని పిలుస్తుంటే ఆ పిలుపుని చాలా ఎంజాయ్ చేశాను. నవంబర్ 16 మరుసటి రోజు శ్రేయా వివాహం కారణంగా పట్టా తీసుకోవడానికి యూనివర్సిటీకి వెల్లలేదు. మార్చి 15నాడు తల్లికూతుర్లు ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

815
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles