దివ్యాంగుల డ్రైవింగ్ స్కూల్


Tue,March 19, 2019 11:47 PM

anitha-driving
ద్విచక్రవాహనానికి కొంచెం మార్పులు చేసి, అదనపు చక్రాలు అమర్చితే దివ్యాంగులు దాన్ని నడపగలరు. అలాంటివే చాలా వరకూ ప్రత్యేకంగా మార్కెట్‌లోకి వచ్చాయి. బైక్‌ల సంగతి అలా ఉంచితే... మరి దివ్యాంగులు కార్లను నడపాలనుకుంటే సాధ్యమవుతుందా? అవుననే అంటున్నది డాక్టర్ అనితా శర్మ..
అమృత్‌సర్‌కు చెందిన డాక్టర్ అనితా శర్మ దివ్యాంగుల కోసం ఓ డ్రైవింగ్ స్కూల్‌ను స్థాపించింది. కాళ్లు, చేతులు కదపలేని వారికి కార్‌డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నది. ఈ స్కూల్‌ను స్థాపించడం తన జీవిత లక్ష్యంగా చెపుతున్నది. అనితా శర్మ ఆరేండ్లప్పుడు పోలీయోకు గురైంది. తర్వాత నడుముకు పక్షవాతం సోకింది. చిన్నతనంలో సపోర్ట్ వీల్స్‌తో బైక్ నడిపేది. పెరిగే కొద్ది కార్‌ను కూడా నడపాలనుకుంది. అనుకున్నట్టుగానే యాక్సిలిరేటర్, క్లచ్, బ్రేక్‌ను కాళ్లతో బదులుగా చేతులతో అదుపు చేయడానికి మార్పులు చేయించింది. ఒక లివర్‌తో వాటిని కంట్రోల్ చేయగలుగుతున్నది.

స్థానిక మెకానిక్ రాజేశ్ శర్మ జుగాడ్ ఈ మార్పులు చేశారు. పీహెచ్‌డీ విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఈ కారు ఆమెకు వెన్నెముకలా పని చేసింది. ఆ సమయంలోనే తన లాంటి వారి కోసం డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నది. ప్రపంచ రికార్డులు సాధించిన దివ్యాంగుడు నవీన్ గులియా ప్రభావంతో అనిత ఈ స్కూల్‌ను ప్రారంభించింది. కాలేజీలో అనిత కార్‌డ్రైవింగ్ చూసిన గులియా తనకు కూడా డ్రైవింగ్ నేర్పించాలని కోరాడు. కానీ ఎలా సాధ్యమవుతుందో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత సొంత కార్లోనే ఆయనకు డ్రైవింగ్ నేర్పించింది అనిత. ఆ తర్వాత ఇంకొంతమంది దివ్యాంగులకు కూడా సొంతంగానే కార్‌డ్రైవింగ్ నేర్పించింది. దీనికి మంచి స్పందన రావటంతో వెంటనే స్కూల్‌ను ప్రారంభించింది. అవసరమైన లైసెన్స్‌ను కూడా పొందింది. 2013లోఈ స్కూల్‌ను ప్రారంభించి దివ్యాంగులకు శిక్షణ ఇస్తున్నది. కాళ్లు, చేతులు కదుపలేకుండా ఉన్న ఎవరికైనా ఆమె డ్రైవింగ్ నేర్పిస్తున్నది.

ఒక క్లాస్‌లో కేవలం ఒకరికి మాత్రమే బోధిస్తుంది. ఎందుకంటే వారు వేర్వేరు సమస్యలను కలిగి ఉంటారు. అందుకే ఎవరికి చెందిన విధానం వారికి ఉంటుందని చెపుతున్నది అనిత. అటోయేటిక్ గేర్లు, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్‌ను చేతులతో అదుపు చేయటం వంటి మార్పులు చేసిన కారులో నేర్పిస్తున్నది. ఇప్పుడు సుమారు 17 మందికి కార్ డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నది అనితా. ఈ శిక్షణ వారికి, వారి జీవితానికి వెన్నెముకలా పని చేస్తున్నది చెప్తున్నది.

588
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles