అందాల ప్రపంచం నుంచి ఆర్మీలోకి..


Thu,March 21, 2019 02:38 AM

ఫ్యాషన్ ప్రపంచంలో అందాలను ఒలకబోసింది. ఆకట్టుకునే అరవిందంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. కానీ, తల్లి కోసం, చిన్నప్పటి లక్ష్యం కోసం అవన్నీ వదిలేసింది. ఆర్మీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడుసైనికాధికారిణిగా సేవలందించనున్నది ఢిల్లీకి చెందిన ఈ అందాల సుందరి.
garima
ఫ్యాషన్, డిఫెన్స్ రెండింటికీ అసలు పొంతనే లేదు కదా! ఫ్యాషన్ రంగంలో అందమైన జీవితాన్ని గడుపుతున్న ఎవరైనా సరే మళ్లీ వేరే రంగం వైపునకు వెళ్తారా? ఆడవాళ్లకు కష్టం అని భావించే డిఫెన్స్ రంగంవైపు దృష్టి సారిస్తారా? ఇలాంటి సందేహాలనే చెక్ పెడుతూ మిస్ చార్మింగ్ ఫేస్ ఇండియాగా గుర్తింపు పొందిన గరిమ యాదవ్ ఆర్మీ అధికారిగా విధుల్లో చేరింది. తండ్రి చిన్నప్పుడే వదిలి వెళ్లడంతో తల్లి గరిమని కష్టపడి పెంచింది. ఆమెను గర్వించే స్థాయికి తీసుకెళ్లాలని గరిమ అనుకునేది. ఐఏఎస్, ఐపీఎస్ కావాలని డిగ్రీ చదువుతున్నప్పుడే నిర్ణయించుకుంది. అవసరాల కోసం అప్పుడే ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో పార్ట్‌టైం ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలోనే సివిల్స్ రాసింది. మెయిన్స్‌కు అర్హత సాధించింది. 2017 మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్ అందాల పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇటలీలో జరిగిన ఈ పోటీల్లో గరిమ విజేతగా నిలిచింది. అయితేనేం అక్కడితో ఆగిపోలేదు. ఆమె లక్ష్యం పబ్లిక్ సర్వీస్. పోటీ పరీక్షలకు సిద్ధం అయింది. సీడీఎస్ (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్) పరీక్ష ద్వారా మొదటి ప్రయత్నంలోనే డిఫెన్స్ రంగంలోకి ఎంపికైంది. ఇండియన్ ఆర్మీలోకి వెళ్లే ముందు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. క్లిష్టమైన వాతావరణంలో శిక్షణ తీసుకున్న ఆమె ఇప్పుడు లెఫ్టినెంట్ అధికారిణిగా దేశానికి సేవలు అందించనున్నది. ఆడపిల్లవు ఆర్మీలో ఏం సాధించగలవు, మోడలింగ్‌లోనే కెరీర్ బాగుంటుంది అనే ఎందరి మాటలనో అధిగమించి లక్ష్యం కోసం సైనిక బాట పట్టింది.

458
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles