క్యాన్సర్‌ను గుర్తిస్తుంది


Fri,March 22, 2019 12:32 AM

చాలా మంది మహిళల్లో రొమ్మ క్యాన్సర్ అనేది ఆందోళనకరమైన సమస్య. నిరంతర పరిశోధన తర్వాత ఈ సమస్యను నివారించే మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ సరైన సమయంలో గుర్తించలేకపోవటం వల్ల నష్టం వాటిల్లుతున్నది. ఈ నేపథ్యంలో ప్రధానంగా అర్బన్, రూరల్ ప్రాంత మహిళలకు అందుబాటులో ఉండేలా కేరళకు చెందిన శాస్త్రజ్ఞులు రొమ్ము క్యాన్సర్‌ను కనిపెట్టే బ్రా ఎలక్ట్రానిక్ డివైజ్‌ను కనిపెట్టారు.
cancer
స్క్రీనింగ్ టెస్టుల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చు అనే విషయంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అర్హులైన ప్రతి మహిళకూ మమోగ్రామ్, స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం, దాని వల్ల ప్రయోజనాలు, ప్రమాదాల గురించి వారికి వివరించడం ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటారు. ఇలాంటి పద్ధతులు సాధారణంగా అర్బన్, రూరల్ ప్రాంతాల మహిళలకు అందుబాటులో ఉండవు. దీని ద్వారా మహిళలు ఈ క్యాన్సర్‌తో బాధపడే ప్రమాదం ఉంది. అలాంటి వారికోసమే కేరళలోని త్రిశూర్‌కు చెందిన సీ-మెట్( సెంటర్‌ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ) సంస్థ క్యాన్సర్‌ను గుర్తించే బ్రా ( ఎలక్ట్రానిక్ డివైజ్)ను కనిపెట్టింది. ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్త, నారీశక్తి అవార్డు గ్రహీత డాక్టర్ సీమ ఆధ్వర్యంలో సుమారు నాలుగేండ్ల పరిశోధన తర్వాత ఈ డివైజ్‌కు తుది రూపం వచ్చింది. శరీర ఉష్ణోగ్రతను ప్రామాణికంగా తీసుకుని ఈ డివైజ్ పని చేస్తుంది. సెన్సార్ టచ్‌తో రొమ్ముక్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తుంది. ఈ డివైజ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేస్తారు. 2డీ పిక్చర్ల ఆధారంగా క్యాన్సర్ ఉందా లేదా అని గుర్తించే వీలుంది.ఇప్పటి వరకూ 117 మందికి పరీక్షలు నిర్వహించారు. కేవలం 15 నుంచి 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీన్ని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడానికి సులభంగా ఉంటుంది. ఏ వయసు వారైనా దీని ద్వారా వైద్యపరీక్షలు చేయించుకోవచ్చనీ, రేడియేషన్, నొప్పి భయం అవసరం లేదనీ, మహిళల గోప్యతకు కూడా ప్రాధాన్యతను ఇచ్చి దీన్ని తయారు చేసినట్టు చెప్తుంది. దీని ధర సుమారు రూ.200 నుంచి 500 వరకూ ఉంటుందనీ, గ్రామీణ ప్రాంత మహిళలు కూడా పరీక్షలు చేయించుకొనే వీలుంటుందని సీమ అంటుంది.

637
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles