ఆపరేషన్ అవసరమా?


Fri,March 22, 2019 12:34 AM

మా నాన్న వయస్సు 54. విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఒక పక్క పెరాలసిస్‌లాగా వస్తే పెద్ద దవాఖానలో చూపించాం. బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పిండ్రు. హైదరాబాద్‌లో ఈ మధ్య కొత్తగా ఐఓఎన్‌ఎం (IONM) కొత్త పద్ధతి వచ్చినట్లు తెలసింది. బ్రెయిన్ సర్జరీతో ట్యూమర్ తొలగించి, పెరాలసిస్ రాకుండా చెయ్యొచ్చని చెప్పారు. దయచేసి దాని గురించి తెలియజేయగలరు.
- మల్లేష్ యాదవ్, జనగాం

Couns
ఐఎంఆర్‌ఐ పరిజ్ఞానంతో న్యూరో సర్జరీలు ఇకపై మరింత భద్రంగా, విజయవంతంగా చేయవచ్చు. దీనినే ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐఓఎన్‌ఎం) అంటారు. అత్యాధునిక న్యూరో శస్త్రచికిత్స విధానాలతో న్యూరో సంబంధ రోగులకు ఎలాంటి హాని జరుగకుండా సురక్షితంగా శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చు. ఇంట్రా ఆపరేటివ్ న్యూరో ఫిజియోలాజికల్ మానిటరింగ్ విధానం.. న్యూరో శస్త్రచికిత్సలకు ఒక వరం లాంటిది. పైగా దీనికి జతగా ఇంట్రా ఆపరేటివ్ యంఆర్‌ఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఆపరేషన్ చేసేటప్పుడే ట్యూమర్ పూర్తిగా తొలగించారా? లేదా? అని ఆపరేషన్ థియేటర్‌లోనే తెలుసుకోవచ్చు. బ్రెయిన్ సర్జరీలలో కొన్ని చాలా సంక్లిష్టంగా ఉంటాయి. మెదడులో మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్వర్శ సంబంధ భాగాలను ప్రభావితం చేసే ప్రాంతంలో కొన్ని ట్యూమర్లు తొలగించడం ఎంతో రిస్క్‌తో కూడుకున్న పని.

అత్యాధునిక ఇమేజ్ గైడెన్స్, ఇంట్రా 3T ఎంఆర్‌ఐతో కూడిన ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ (ఐఓఎన్‌ఎం) విధానం సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను సురక్షితంగా నిర్వహించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ అత్యాధునిక పద్ధతుల్లో క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సైతం సురక్షితంగా నిర్వహించవచ్చు. ఇకపై బ్రెయిన్ సర్జరీలలో రీడూ (మళ్లీ చేయాల్సిన) అవసరం లేదు. ఒక్కసారే ట్యూమర్‌ను సమగ్రంగా తొలగించవచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సాధారణ మెదడు కణజాలం దెబ్బతినకుండా సురక్షితంగా ట్యూమర్లను తొలగించవచ్చు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో నాడీ వ్యవస్థను పరిశీలిస్తూ ఎలాంటి హాని జరుగకుండా పర్యవేక్షిస్తుంటారు. దీంతో ముఖ్యమైన మాటలు, చూపు, కదలికలు, వినికిడి, రుచి, స్వర్శ వంటి ప్రధాన ఫంక్షన్స్ దెబ్బ తినకుండా రోగికి సంపూర్ణ చికిత్స అందించవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రోగికి శాశ్వతంగా ఏర్పడే ఇబ్బందులను నివారించవచ్చు. అంతేకాకుండా ఎలాంటి వైకల్యానికి గురికాకుండా చూసుకోవచ్చు. శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో రోగిని మెలకువగానే ఉంచే అవేక్ సర్జరీ కూడా చేయవచ్చు.

డాక్టర్. ఆనంద్
బాలసుబ్రమణ్యం
సీనియర్ న్యూరో సర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్.

465
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles