లవ్లీ.. లంగాఓణీ


Fri,March 22, 2019 12:37 AM

పదహారేండ్ల పడుచు నుంచి.. నాలుగు పదుల వయసు దాటిన వాళ్లు కూడా.. ఏ చిన్న అకేషన్ వచ్చినా.. ఏ చిన్న పండుగొచ్చినా.. ఎంచుకుంటున్న డ్రెస్ లంగా-ఓణీ.. పెండ్లిళ్ల సీజన్.. పండుగ సీజన్‌లో.. పదహారణాల పడుచులా వెలిగే పోవాలంటే బెస్ట్ డ్రెస్ కూడా ఇదే! అందుకే ఆ అందాల లంగా-ఓణీ సోయగాలను ఇక్కడ పరిచయం చేస్తున్నాం.
Fashan
1. సెమీ సిల్క్ సీ గ్రీన్ కలర్ లెహంగా ఇది. చెక్స్ ప్యాటర్న్‌లో గోల్డెన్, సిల్వర్ జరీ వీవింగ్‌తో నెమళ్లు, సింహం బొమ్మలతో చూడగానే ఆకట్టుకునేలా ఉంది. దీనికి గోల్డెన్ జరీ వచ్చిన రెండు బార్డర్‌లను జతచేశాం. బ్లౌజ్‌గా సీ గ్రీన్ కలర్ రాసిల్క్‌ని ఎంచుకున్నాం. దీనికి బుట్ట చేతులు చూడముచ్చటగా ఉన్నాయి. నెక్ లైన్ దగ్గర కుందన్స్, థ్రెడ్ వర్క్ చేయించాం. ఎర్రని ప్యూర్ జార్జెట్ దుపట్టాకి అక్కడక్కడ బుటీస్ కుట్టాం. గోల్డెన్ జరీ బార్డర్ మెరిసిపోతున్నది.

2. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బ్లూ కలర్ ప్యూర్ కంచి పట్టు లంగా మొత్తం చెక్స్ వచ్చాయి. దీంట్లో లేడీ పిల్లల డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. గోల్డెన్ జరీతో వచ్చిన పెద్ద అంచు దీనికి మరింత వన్నె తెచ్చింది. బ్లూ కలర్ రాసిల్క్ బ్లౌజ్ కట్ వర్క్ పీకాక్ డిజైన్‌ని ఇచ్చాం. స్లీవ్స్ మీద గోల్డెన్ బుటీ ఇచ్చి, పింక్ పట్టు అంచును జతచేశాం. పింక్ కలర్ క్రేప్ దుపట్టా మీద చిన్న చిన్న బుటీస్ ఇచ్చాం. కట్ వర్క్ బార్డర్ సూపర్ లుక్ తెచ్చి పెట్టింది.
Fashan1
3. చిన్న చెక్స్, మొత్తం బుటీస్ వచ్చిన ఎర్రని బెనారస్ లెహంగా ఇది. దీనికి వంకాయ రంగు పెద్ద బార్డర్ మరింత వన్నె తెచ్చింది. బ్లౌజ్‌కి ఇదే ఫ్యాబ్రిక్ వాడాం. కాకపోతే నెక్ లైన్ దగ్గర జర్దోసీ, కుందన్స్‌తో వర్క్ చేయించాం. బ్లూ కలర్ షిఫాన్ దుపట్టా ఎంచుకున్నాం. దుపట్టా మొత్తం కుందన్స్‌ని ఇచ్చాం. ఇక సీక్వెన్స్ బార్డర్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది.

4. రాకుమారిలా మెరిసిపోయేందుకు ఈ లంగా-ఓణీ వేయాల్సిందే! యెల్లో, పింక్ కాంబినేషన్‌లో, చెక్స్ ప్యాటర్న్‌లో కుట్టిన బెనారస్ లెహంగా ఇది. దీనికి జరీ బుటీ వచ్చిన పెద్ద బార్డర్‌ని జతచేశాం. ఇదే ఫ్యాబ్రిక్స్‌తో బ్లౌజ్‌ని కుట్టాం. కాకపోతే నెక్ లైన్ దగ్గర జర్దోసీతో కాస్త హెవీగా వర్క్ చేయించాం. యెల్లో కలర్ జార్జెట్ దుపట్టా మీద ఫుల్‌గా గోల్డెన్ బుటీస్ వచ్చాయి. దీనికి సీక్వెన్స్, జర్దోసీతో చేసిన పింక్ రాసిల్క్ బార్డర్ మరింత హైలైట్‌గా నిలిచింది.

-సుప్రజాదేవి చలసాని
-ఫ్యాషన్ డిజైనర్
-మధురాస్ డిజైనర్ స్టూడియో
-ఎస్.ఆర్.నగర్, హైదరాబాద్
-ఫోన్ : 9052903953
https://www.facebook.com/madhurasboutique/

615
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles