కుంకుడుకాయతో..


Sat,March 23, 2019 01:02 AM

పొడవాటి జుట్టుని శుభ్రపరుచడానికి ప్రకృతి సిద్ధంగా లభించిన షాంపూగా కుంకుడుకాయని వాడుతారు. సౌందర్య ఉత్పత్తుల్లో భాగంగా కుంకుడుకాయని విపరీతంగా వాడుతారు. కుంకుడుకాయలతో ఇంటిని ఎలా శుభ్రపరుచుకోవాలో తెలుసా?
cleaning

-ఖరీదైన కారుని డిటర్జెంట్లతో శుభ్రపరుస్తుంటారు. దీనికి బదులు కుంకుడుకాయని ఉపయోగించడంతో కారు పాడవకుండా ఉంటుంది. కారు అద్దాలు కూడా మెరిసిపోతాయి. దీంతో పాటు మంచి సువాసన వెదజల్లుతుంది.
-15 కుంకుడుకాయలు తీసుకోని అందులో 6 కప్పులు నీరు పోసి గంట పాటు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒకరోజు తర్వాత వడకట్టి ప్రాత్రలో ఉంచి మూతపెట్టాలి. దీనికి కాస్త నిమ్మరసం కలిపి నిల్వ ఉంచి ఎప్పుడైనా ఇంటి శుభ్రానికి వాడొచ్చు.
-కుంకుడుకాయ, వెనిగర్, నీటిని తగిన మోతాదులో తీసుకొని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి దుమ్ముపట్టిన కిటికీల మీద స్ప్రే చేయాలి. తర్వాత పొడిబట్టతో ఆ ప్రదేశాన్ని తుడిస్తే కిటికీలు తళతళా మెరుస్తాయి.
-బంగారు ఆభరణాలను కుంకుడుకాయ నీటిలో నానబెట్టాలి. 20 నిమిషాల తర్వాత మెత్తటి బ్రష్‌తో రుద్దాలి. మంచి నీటితో కడిగి మృదువైన బట్టతో తుడిస్తే బంగారు ఆభరణాలను మెరుస్తుంటాయి.
-కుంకుడుకాయ రసం, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చేతిలో వేసుకొని కడుక్కుంటే శుభ్రతతో పాటు మంచి సువాసన వస్తుంది.
-పెంపుడు జంతువులను శుభ్రం చేయడానికి ప్రకృతి సిద్ధంగా లభించే కుంకుడుకాయ రసం ఉత్తమమైనది.

482
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles