హాయిగా నిద్రపోండి ఇలా...


Sat,March 23, 2019 01:04 AM

సరైన నిద్ర లేకపోతే నాడీ వ్యవస్థ మీద, కండరాల పైనా ప్రతికూల ప్రభావాన్నిచూపుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. పెద్దల్లో బరువు పెరగడం, పిల్లల్లో వ్యాధుల ప్రమాదాలు పెరగడం నిద్రలోపం వల్ల ఏర్పడుతాయి.. ఈ రోజుల్లో చాలా మంది సరైన నిద్ర పొందుతున్నారు. అలాంటి వారికోసం ఈ చిట్కాలు.
sleep
-నిద్రపోవడానికి ముందు ఎక్కువ మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించండి. ఇది హార్మోన్ల మీద ప్రభావం చూపుతుంది. సరైన నిద్రపట్టకపోవడానికి కారణం అవుతుంది.
-బాహ్య కాంతి, శబ్దాల నివారణకు అనుకూలంగా ఉండేలా మీ బెడ్‌రూం ఉండాలి.
-వివిధ రకాల గది ఉష్ణోగ్రతలను పోల్చి చూసుకోండి. ఏది సౌకర్యవంతంగా ఉంటే దాన్ని కొనసాగించండి.
-పరుపులు, బెడ్‌షీట్లు,దిండ్లు ఆరోగ్యవంతమైన నిద్రకు సహకరిస్తాయి. నాణ్యమైన దుప్పట్లను వాడడం వల్ల హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.
-రోజూ మధ్యలో కొంచెం నిద్రపోవడం కూడా రాత్రి నిద్రమీద ప్రభావం చూపుతుంది. అవసరం మేరకు మాత్రమే మధ్యాహ్నం, సాయంత్రం నిద్రపోవడం మంచిది.
-మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం వేళలో ఎక్కువ కాఫీలు, చాయ్‌లు తగ్గిస్తే నిద్ర నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది.

579
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles