అద్దంపట్టే కళా ఖండాలు !


Sat,March 23, 2019 01:09 AM

సమాజంలో సెక్స్ వర్కర్లంటే కొందరికి చిన్న చూపు ఉంటుంది. ఎలాంటి ఆధారం లేక తమ శరీరాన్ని అమ్ముకొని జీవితాలను వెళ్లదీసుకుంటున్నారు. అయితే పడుపు వృత్తిలో వారు ఎదుర్కొంటున్న బాధలను వీధిలోని రోడ్లపై పెయింటింగ్ రూపంలో వేసి సెక్స్‌వర్కర్ల పై ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నది కోల్‌కతలోని ఓ దుర్గ పూజ కమిటీ.
street

ఎటువంటి జీవనాధారం లేకనే వారు పడుపు వృత్తిలో కొనసాగుతున్నారు. ఒక వేళ వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధిని అందిస్తే తప్పకుండా ఆ ఊబి నుంచి వాళ్లు బయటికి వస్తారు. అందుకోసమే కోల్‌కతలోని అహిరితొల జుబక్బ్రింద దుర్గ పూజ కమిటీ అలాంటి వారికి అండగానిలిచింది. బెంగాలీకి చెందిన వేశ్యాగృహాలున్న ప్రాంతంలో మట్టితో దుర్గా మాత విగ్రహాలను రూపొందించడం ఆనవాయితీగా వస్తున్నది. వేశ్యలు నివసించే ప్రాంతాలలో ఉన్న మట్టిని ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు కానీ వారి పట్ల మాత్రం వివక్ష చూపుతుంటారు. వారిని ఎప్పుడూ మార్కెట్‌లో కొనుగోలు చేసే ఓ వస్తువుగానే పరిగణిస్తున్నారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా గా పేరున్న సొనగచికి ఉన్న మచ్చను తొలగించేందుకు ప్రత్యేకంగా ప్రాజెక్టును చేపట్టామని అహిరితొల జుబక్బ్రింద దుర్గ పూజ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ సాహా చెబుతున్నారు. ముఖ్యంగా సమాజంలో వేశ్యలపై ఉన్న చులకన భావాన్ని పోగొట్టడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని అన్నారు.

పడుపు వృత్తిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర బాధల నుంచి వారిని విముక్తుల్ని చేయడానికి పలురకాల పెయింటింగ్స్‌తో ప్రజలలో అవగాహన కల్పించడానికి శ్రీకారం చుట్టామన్నారామె. ప్రతి రోజూ సెక్స్‌వర్కర్లు పడుపు వృత్తిలో ఉన్న సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారో, వారి జీవన విధానం ఎలా ఉంటుందో అచ్చుగుద్దినట్లు వాటిని కళ్ళకు కట్టినట్లు సజీవ రూపంలో వారి జీవిత గాథలను వివరించే ప్రయత్నం చేశారు కొంతమంది కళాకారులు. 300 అడుగుల విస్తీర్ణంలో ఈ చిత్రాలను వేయడం ద్వారా సెక్స్ వర్కర్లు ఎదుర్కొంటున్న బాధలను ఆయా బొమ్మల రూపంలో వ్యక్త పరుస్తున్నారు. గుమ్మం వద్ద నిలుచుని ఉన్న ఓ వేశ్య తన నుదుటున ఉన్న కుంకుమ చెరిగిపోయి కనిపించే కళాత్మకమైన చిత్రం వారి పడుపు వృత్తికి అద్దం పడుతున్నది.

732
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles