అమ్మకాల్లో 58% పెరుగుదల


Sat,April 13, 2019 12:33 AM

2019 జనవరి నుంచి మార్చి 31 లోపు.. నివాస సముదాయాల అమ్మకాల్లో 58 శాతం పెరుగుదల నమోదైందని ఒక అధ్యయన సంస్థ వెల్లడించింది. మధ్యంతర బడ్జెట్‌లో నిర్మాణ రంగానికి తగిన ప్రోత్సాహం, జీఎస్టీ తగ్గింపు, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాలే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణమని తెలియజేసింది. 44 శాతం అమ్మకాలు అందుబాటు గృహాల్లోనే జరగడం విశేషం. ముంబై, ఎన్‌సీఆర్, చెన్నై వంటి నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు స్వల్పంగా పెరగడం విశేషం.

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 5.6 లక్షల గృహాల నిర్మాణం ఆలస్యమైందని ఓ నివేదిక తెలియజేసింది. వీటి విలువ ఎంతలేదన్నా రూ.4.50 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనా వేసింది. వీటిలో ముంబై, ఎన్‌సీఆర్‌లు ముందువరుసలో ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి దక్షిణ నగరాల్లో దాదాపు పది శాతం ప్రాజెక్టుల పనులు మందకోడిగా జరుగుతున్నాయి. వీటి నిర్మాణ విలువ దాదాపు 41 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. కొంతమంది డెవలపర్లు నిధులను ఒక ప్రాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు దారి మళ్లించడమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన కొందరు కొనుగోలుదారులు బిల్డర్లకు క్రమం తప్పకుండా సొమ్మును విడుదల చేయడం నిలిపివేశారు. దీంతో, ప్రతి నిర్మాణం విలువ తడిసిమోపెడు అవుతున్నది. పలు నిర్మాణ సంస్థలు సరైన అనుమతుల్లేకుండానే ప్రాజెక్టులను ప్రారంభించడమో కారణమని చెప్పొచ్చు. ఒకవేళ ప్రాజెక్టులు ఆలస్యమైనా, ప్రభుత్వం కొనుగోలుదారుల హక్కులను పరిరక్షించడానికి పూర్తి స్థాయిలో సాయం చేయాల్సి ఉంటుంది. ఇదే విధానాన్ని కేంద్రం ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్‌లో పేర్కొనడం గమనార్హం. ఒకవేళ బిల్డర్ చేపట్టే ప్రాజెక్టు నిలిచిపోతే, ప్రభుత్వమే చొరవ తీసుకుని, అదే ప్రాజెక్టును తిరిగి అదే బిల్డర్‌తో పూర్తి చేయించడమో లేదా మూడో వ్యక్తికి అప్పగించి పూర్తి చేయిస్తుంది.

254
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles