300 డెవలపర్లకు రెరా జరిమానా..


Sat,April 13, 2019 12:34 AM

RERA
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సుమారు మూడు వందల మంది డెవలపర్లపై జరిమానా విధించింది. రెరా నిబంధనల్ని బేఖాతరు చేసిన ఒక్కో డెవలపర్ మీద ఎంతలేదన్నా రూ.50,000 దాకా జరిమానా వేసింది. వీళ్లంతా చేసిన తప్పేమిటంటే.. గత కొంతకాలం నుంచి వారు చేపట్టిన నిర్మాణాల తాజా పరిస్థితిని రెరా పోర్టల్‌లో పొందుపర్చకపోవడమే. అధిక శాతం మంది డెవలపర్లు రెరాలో అనుమతి తీసుకున్నా.. అట్టి ప్రాజెక్టుల తాజా స్థితిగతుల్ని వెల్లడించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెరా నిబంధనల ప్రకారం, ప్రతి డెవలపర్ మూడు నెలలకోసారి తమ నిర్మాణ తాజా ప్రగతిని రెరాలో పొందుపర్చాల్సి ఉంటుంది. అలా చేయకపోవడంతో రెరా చట్టం సెక్షన్ 11, 63 ప్రకారం 50,000 జరిమానాను విధించింది. వాస్తవానికి, సెక్షన్ 63ను ఉల్లంఘిస్తే.. ప్రాజెక్టు వ్యయంలో ఐదు శాతం జరిమానా కట్టాల్సి ఉంటుంది. కానీ, రూ.50,000 జరిమానాకే పరిమితం చేసింది గుజరాత్ రెరా అథారిటీ.

191
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles