ఆలస్యమైతే.. సొమ్ము వెనక్కి


Sat,April 20, 2019 12:48 AM

real-estate1
కొందరు డెవలపర్లు తమ కొత్త ప్రాజెక్టు ప్రారంభంలో.. కొనుగోలుదారులకు అనేక హామీలను గుప్పిస్తుంటారు. కొన్నాళ్లు గడిచాక నిర్మాణాన్ని ఆలస్యం చేస్తూ కొన్నవారికి చుక్కలు చూపిస్తుంటారు. దీంతో అటు అద్దె కట్టలేక.. ఇటు కొత్త ఇంటి బ్యాంకు ఈఎంఐ చెల్లించలేక నరకం అనుభవిస్తుంటారు. ఇలాగే ఒక బిల్డర్ మూడేండ్లలోనే ఫ్లాట్‌ను అందజేస్తానని రూ.39.30 లక్షలను ఒక కొనుగోలుదారుడు వద్ద తీసుకున్నాడు. మూడేండ్ల బదులు ఏడేండ్ల తర్వాత కానీ అప్పగించలేకపోయాడు. ఆలస్యాన్ని పేర్కొంటూ ఫ్లాట్ కొన్నవ్యక్తి అత్యున్నత న్యాయస్థానాన్ని సంప్రదించాడు. దీంతో, ఆయా బిల్డర్ కోర్టు మెట్లు ఎక్కాడు. కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన న్యాయస్థానం కొనుగోలుదారుడి పక్షాన నిలిచింది. ఆలస్యం చేసినందుకు అట్టి సొమ్మును కొనుగోలుదారుడికి వెనక్కివ్వాలని తీర్పునిచ్చింది.

451
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles