విద్యుత్తు పొదుపు చేద్దామా..


Sat,April 20, 2019 12:50 AM

electricity
విద్యుత్తును ఉత్పత్తి చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, కానీ పొదుపు చేయడం చాలా సులువు.. అంటూ విద్యుత్తు సంస్థలు పౌరులకు అవగాహన కల్పిస్తుంటాయి. ఎందుకంటే విద్యుత్తు ఉత్పతిక్తి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో, అదే సమయంలో పర్యావరణంపై పడే ప్రభావం అంతే ఉంటుంది. అంతరించిపోయే మానవవనరులను ఉపయోగించి ఉత్పత్తవుతున్న విద్యుత్తును కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంట్లో, కార్యాలయాల్లో ఇలా ఎక్కడైనా విద్యుత్తు దుర్వినియోగాన్ని తగ్గిస్తే విద్యుత్తు బిల్లులు తగ్గించుకోవటంతో పాటు, వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల విద్యుత్తు వృథాను అరికట్టవచ్చు.

అవసరం ఉంటేనే వాడాలి..

విద్యుత్తును పొదుపు చేయడం మన చేతిలో పని. వినియోగంలో లేనపుడు లైట్లు, ఇతర విద్యుత్తు పరికరాలను ఎప్పుడూ ఆఫ్ చేయాలి. దీని వల్ల పెద్ద మొత్తంలో విద్యుత్తు శక్తి వృథాను నియంత్రించవచ్చు. అవసరం ఉంటేనే విద్యుత్తు పరికరాలను వాడాలి. ఉదాహరణకు గాలి, వెలుతురు వచ్చే బాల్కనీ ఉన్న ఇండ్లలో బట్టలను ఆరుబయట ఆరబెట్టాలి. వాషింగ్ మెషిన్ డ్రైయర్‌ను వినియోగించకూడదు. ఇల్లు వేడెక్కకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకొని ఏసీ వినియోగాన్ని తగ్గించాలి. దీని వల్ల పెద్ద మొత్తంలో విద్యుత్తు ఆదా అవుతుంది. ఇంట్లో ఉన్న ఏ విద్యుత్తు పరికరం ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తున్నదో తెలుసుకునేందుకు పలు రకాల పరికరాలు మార్కెట్‌లో ఉన్నాయి. వీటి ద్వారా రోజువారీ విద్యుత్తు ఖర్చును పరిశీలిస్తూ ఉండాలి.

సాధారణ లైట్లను మార్చాలి..

ఇండ్లలో వాడే సాధారణ బల్బులు వెలిగేందుకు ఎక్కువ మొత్తంలో విద్యుత్తును వినియోగించుకుంటాయి. అందుకే వీటి స్థానంలో హాల్‌జెన్ లేదా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైట్స్ (సీఎఫ్‌ఎల్), లైట్ ఎమిటింగ్ డియోడ్ (ఎల్‌ఈడీ)లను అమర్చుకోవాలి. ఇండ్లు, కార్యాలయాలతో పాటు వీధి దీపాల్లోనూ సాధారణ లైట్లను మార్చాలి. దీని వల్ల 25-80శాతం విద్యుత్తు ఆదా అవుతుంది. అయితే ఈ లైట్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ కాలం వస్తాయి. ఆర్థిక ప్రయోజనం ఉండటంతో పాటు, పర్యావరణానికి మేలు జరగుతుంది.

పూర్తిగా ఆఫ్ చేయాలి..

విద్యుత్తు పరికరాలు వాడకంలో లేనపుడు ఎక్కువ మంది పూర్తిగా ఆఫ్ చేయకుండా స్టాండ్‌బై మోడ్‌లో పెడుతుంటారు. దీని వల్ల ఎక్కువ శాతం విద్యుత్తు వృథా అవుతుంది. స్టాండ్‌బై మోడ్‌లో ఉండటం వల్ల అదనంగా 20శాతం విద్యుత్తు వినియోగం పెరుగుతుంది. దీనికి పరిష్కారంగా స్మార్ట్ పవర్ స్ట్రిప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీని వల్ల స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పటికీ విద్యుత్తు వృథా కాదు.

ఆటోమేటిక్ విధానంతో మేలు..

స్మార్ట్ థర్మోస్టార్ట్ వల్ల పరికరాలను ఆటోమెటిక్‌గా నియంత్రించవచ్చు. ఉష్ణోగ్రత పెరిగినా, తగ్గినా పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్తు పరికరాలు నియంత్రించబడతాయి. థర్మోస్టార్ట్ ప్రోగ్రాం వల్ల విద్యుత్తు వృథాను దాదాపుగా తగ్గించవచ్చు. విదేశాల్లో దీన్ని ఎక్కువగా వినియోగిస్తుండటం చూస్తుంటాం. ఇంట్లో, కార్యాలయం ఇలా ఎక్కడైనా ఈ ఆటోమేటిక్ విధానం వల్ల మంచి ఫలితాలే వస్తాయ. దీని వల్ల ఏడాదికి 180 డాలర్ల దాకా మిగులుతుందని అక్కడి వినియోగదారులు చెబుతున్నారు.

495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles