సర్వేయర్ల తీరుతో..


Sat,April 20, 2019 12:52 AM

సవాలక్ష సమస్యలుసర్వేయర్.. రెవెన్యు శాఖలో కీలకమైన ఉద్యోగి. భూమి కరెక్టుగా ఉందా? లేదా? అనే అంశాన్ని పరిశీలించి.. క్షేత్రస్థాయిలో కొలతలు వేసి.. సర్వే చేసి.. మ్యాపు గీసి.. ఒక స్టాంపు వేసివ్వడమే అతని డ్యూటీ. అయితే, హైదరాబాద్‌లో సర్వేయర్‌కు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఒక డెవలపర్ అపార్టుమెంట్ కట్టాలన్నా.. విల్లా నిర్మించాలన్నా.. అట్టి స్థలం కరెక్టేనని సర్వేయర్ స్టాంపు కోసం.. పలు నిర్మాణ సంస్థలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.
survey
వాసు ఒక నిర్మాణ సంస్థలో ప్రభుత్వానికి సంబంధించిన పనులన్నీ చక్కబెట్టే ఉద్యోగి. అతను రెండు నెలల్నుంచి తిరిగినా సర్వేయర్‌ను కలవలేకపోయాడు. దీంతో విసుగుచెందిన ఆయా నిర్మాణ సంస్థ ఎండీయే రంగంలోకి దిగాడు. అతను ఎక్కడుంటాడో తెలుసుకుని స్వయంగా కలుద్దామని బయల్దేరాడు. అక్కడికెళితేనేమో సర్వేయర్ చాలా బిజీగా ఉన్నాడు. తను ఎంత బిజీ అంటే.. ఆయా బిల్డర్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆయనతో పాటు దాదాపు డజను మంది అతని కోసం అక్కడే ఎదురు చూస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రెండు గంటలు దాటింది.

ఆతర్వాత, ఆయా సంస్థ ఎండీ వైపు అడుగులు వేసిన సదరు సర్వేయర్‌ని బిల్డర్‌ని చూసి.. ఏమిటీ సంగతి అంటూ కనుసైగ చేశాడు. దీంతో, వెంటనే అతని వద్దకెళ్లిన వాసు.. తాము ప్రారంభించే ప్రాజెక్టు భూమి వద్దకొచ్చి సర్వే చేయాలని కోరాడు. ఎమ్మార్వో, ఆర్డీవో.. ఇలా చాలామంది చెప్పిన పనులున్నాయి. ఒకట్రెండు నెలల తర్వాత మీ పని చేస్తానని అన్నాడు. దీంతో వాసు విస్తుపోయాడు. ఏం చెప్పాలో అర్థకాలేదతనికి. విషయం బిల్డర్‌కి చెప్పగా.. ఎంతో కొంత సొమ్ము ముట్టచెబుదామని అన్నాడు. దీంతో, వాసు సదరు సర్వేయర్‌తో మాట్లాడాడు. ఆయా ప్రాజెక్టు వద్దకెళ్లి భూమిని సర్వే చేయడానికి దాదాపు లక్షన్నర రూపాయలివ్వాలని అన్నాడు. ఇక తప్పదన్నట్లు సదరు బిల్డర్ సరేనన్నాడు.

-ఇది ఏ ఒక్క డెవలపరో ఎదుర్కొంటున్న సమ స్య కాదు.. దాదాపు అందరు డెవలపర్లకు ప్రత్యక్షంగా ఎదురవుతున్న అనుభవమే. పశ్చిమ హైద రాబాద్‌లో కొందరు సర్వేయర్లు బిల్డర్లు, రియ ల్టర్లతో ఆటలాడుకుంటున్నారు. బిల్డర్ ఎవరైనా, చివరికీ సర్వేయర్ వద్దకెళ్లి.. తమ స్థలాల్ని సర్వే చేయమని ప్రాధేయపడే స్థాయికి తెస్తున్నారు. నిర్మాణ సంస్థలను తెగ ఇబ్బంది పెడుతున్న సర్వేయర్ల వ్యవస్థను గాడిలో పెట్టి.. వారిలోనూ జవాబుదారీతనం నెలకొల్పేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్మాణ రంగం కోరుతున్నది. రెవెన్యూ వ్యవస్థను ఆన్‌లైన్‌లోకి తెస్తేనే ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని నిర్మాణ రంగం ముక్తకంఠంతో చెబుతున్నది.

2332
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles