వావ్.. వర్టికల్ గ్రీనరీ కిస్మత్తుపురాలో ద ఆర్ట్


Sat,April 20, 2019 12:53 AM

kismathpur
హారిజాంటల్ నిర్మాణాల్ని కట్టినప్పుడల్లా పదిశాతం పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తాం. మరి, బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు నిర్మించేటప్పుడు పచ్చదనం అంతే అభివృద్ధి చేయాలి. లేకపోతే, ఉష్ణోగ్రతలు మధ్యస్తంగా ఉంటాయి. ఈ విషయానికి నగర నిర్మాణ రంగం ప్రాధాన్యతనివ్వాలని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఆమె సూచనల్ని అందుకున్న గిరిధారి హోమ్స్ టీఎస్‌పీఏ జంక్షన్ వద్ద గల కిస్మత్తుపురాలో ద ఆర్ట్ అనే అందమైన వర్టికల్ గ్రీనరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దీన్ని ఫోర్త్ జనరేషన్ హోమ్స్ నిర్మాణంగా అభవర్ణించవచ్చు. ఈ ట్రెండ్ ఎక్కువగా జపాన్, మలేసియా, హాంకాంగ్, చైనా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఇప్పుడీ ట్రెండ్ నగరవాసులకు పరిచయం చేసింది గిరిధారి హోమ్స్.

-కాలుష్యాన్ని పడక గదిలోకి రానీయకుండా.. నాసా సిఫార్సు చేసిన మొక్కల్ని కిటికీల వద్ద ఏర్పాటు చేస్తారు. దీంతో, లోపల ఉండే చెడు వాసనలను బయటికి పంపించేస్తుంది. శబ్ద కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఇంట్లో నివసించేవారికి అధిక ఆక్సిజన్ అందుతుంది. అందుకే, వీటిని ఆక్సి రిచ్ హోమ్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు మధ్యలో 300/70 అడుగుల వాటర్ ఫాల్ నుంచి వెలువడే రేణువులు గాలిలోని దుమ్ము, ధూళిని పారద్రోలుతాయని సంస్థ చెబుతున్నది. ద ఆర్ట్‌ను రోడ్డు వైపు నుంచి చూస్తే.. ప్రాజెక్టు ఎలివేషన్ల మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పచ్చటి క్రీపర్లు కనిపిస్తాయి. ఇదంతా ఒక పచ్చటి తోరణంలా దర్శనమిస్తుంది. ఇందులో ఏర్పాటు చేసే హాఫ్ ఒలంపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ ప్రతిఒక్కరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. ఇందులో నివసించేవారికోసం సంస్థ ప్రత్యేకంగా 72 రకాల సదుపాయాల్ని డిజైన్ చేసింది.

- ప్రాజెక్టు గ్రాండ్ ఎంట్రెన్స్ లాబీ నుంచి లోపలికి వస్తుంటే ఆ ఆనందమే వేరని చెప్పొచ్చు. సీటింగ్ డెక్, సంకెన్ సీటింగ్, మహిళలకు ప్రత్యేక స్విమ్మింగ్ పూల్, ఫ్రాగరెన్స్ గార్డెన్, అక్వా కార్డియో, సన్ డెక్, మిస్ట్ గార్డెన్, స్క్రిబిల్ వాల్, ైక్లెంబింగ్ వాల్, ఫుట్ రిఫ్లెక్సాలజీ పాత్తు, పెర్న్ గార్డెన్స్, నెగటివ్ ఆయాన్ జోన్, గార్డెన్ బార్బీక్యూ వంటివి ద ఆర్ట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇందులో ప్రత్యేకంగా నక్షత్ర గార్డెన్‌ను అభివృద్ధి చేస్తారు. అతిపరిశుద్ధ స్థలంలో పెరిగే ఆకులు, పూలు, విత్తనాలు వంటివి ఇందులో పొందుపరిచారు. ఫలితంగా, ఇందులో నివసించేవారు ఆరోగ్యవంతులుగా, సిరిసంపదలు కలిగినవారుగా ఉంటారని సంస్థ అంటున్నది. మొత్తానికి, ఆధునిక కొనుగోలుదారులకు అన్నివిధాల నప్పేవిధంగా ద ఆర్ట్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని గిరిధారి హోమ్స్ చెబుతున్నది.

పేరు : ద ఆర్ట్
ఎక్కడ : కిస్మత్తుపురా
విస్తీర్ణం : 3.65 ఎకరాలు
ఫ్లాట్ల సైజు : 1171- 1857 చ.అ. 2, 3 పడక గదులు
రెరా అనుమతి : ఉంది
ప్రస్తుత పరిస్థితి: జోరుగా నిర్మాణ పనులు

502
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles