ఈ పర్యాటక ప్రదేశాలు పెండ్లిపందిళ్లు


Fri,May 3, 2019 01:22 AM

పెండ్లంటేనే అప్పటివరకు చేసిన ప్రయాణానికి ఒక గమ్యం. అలాంటి గమ్యం ఎలా ఉండాలి? గ్రాండ్‌గా ఉండాలి. ఇప్పుడు ఆ గ్రాండ్‌నెస్ కాస్త మరింత రిచ్‌గా మారుతుంది.డెస్టినేషన్ మ్యారేజ్‌ల పేరుతో వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఆసక్తి చూపుతున్న డెస్టినేషన్ మ్యారేజ్ లొకేషన్‌లపై ప్రత్యేక కథనం..


పెండ్లంటే ఆకాశమంత పందిరి, భూలోకమంత పీటలేయాలా? ఇంటి ముందు పెండ్లి ఫంక్షన్ హాల్ పరిధులు దాటి ఇప్పడు పర్యాటక ప్రదేశాలకు వెళ్లింది. బంగ్లాలు, కోటలు, మహల్‌లు, సముద్రతీరాలు ఇప్పుడు పెండ్లి పందిరిలు వేసుకొని ముస్తాబు అవుతున్నాయి. ఒకరు సముద్ర తీరంలో పెండ్లి చేసుకోవాలనుకుంటే.. ఇంకొకరు ఆకాశంలో ఎగురుతున్న విమానంలో తాళికట్టాలనుకుంటారు. మరొకరు ప్రవహించే నీరు, కదిలే బోటు ఇలా కోరికలు రకరకాల సృజనాత్మకతను జోడించుకొని కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జీవితంలో ఒకేసారి చేసుకునే వివాహ వేడుకకు సరైన ప్రదేశం కోసం చాలామంది వెతుకుతున్నారు. అది ఎంచుకోవడం కూడా కష్టమైన పని.

సెయింట్ లూయిస్

St-Lucia
అందమైన ద్వీపాన్ని చూస్తే చాలనుకునే వాళ్లుంటారు. కనుచూపు మేర సముద్రం, ఆకాశం నుంచి పాల నురగ పడి సముద్రంలా మారినట్టు కనిపించే అత్యద్భుతమైన ప్రాంతం ఇది. అలలు వచ్చి కాళ్లకు తాకుతుంటే, సముద్రపు ఒడ్డున ఉన్న రాళ్లపై నిలబడి పెండ్లి చేసుకుంటే వర్ణించడం సాధ్యమా?

ఓర్లాండో

Orlando
థీమ్ పార్కులు, సవారీలు, పచ్చని ప్రకృతికి చిరునామా. ఈ ప్రాంతాన్ని మక్కా అని పిలుస్తారు. ఎగిరితే మేఘాలు తాకుతాయా, కిందికి చూప్తే పడిపోతామా అన్నట్టు ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకుంటే జీవితంలో అదొక మధురమైన ఘట్టంగా మిగిలిపోతుంది.

డబ్లిన్

Dublin
పచ్చిక బయళ్లు, గ్రామీణ నేపథ్యం, ఆధ్యాత్మికతను నింపే చర్చిలు ఇలా ప్రశాంతమైన వాతావరణంలో పెండ్ల్లితంతు జరిగితే ఎంత బాగుంటుందో కదా! ఊహలకు అందని ఆలోచనలు ఇక్కడ నిజం చేసుకోవచ్చు.

వియత్నాం

Vietnam
చుట్టూ ఎత్తైన పర్వతాలు, సంప్రదాయ నృత్యా లు, భిన్నమైన సంస్కృతితో నిత్యం కళకళలాడే వియత్నాంలో పెండ్లి చేసుకోవాలని చాలామంది కోరుకుంటారు. సంప్రదాయంగా పెండ్లిచేసుకోవాలనుకున్న వాళ్లకు ఇదొక సంపూర్ణ వేదిక. సముద్రపు అలల చప్పుడు, నీటి మీద తేలియాడే రిసార్ట్స్‌లు ఇక్కడ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి.

బెర్లిన్

Berlin
పెండ్లంటే తాళికట్టడం, తాళాలు కొట్టడం కాదు. అందమైన ప్రకృతి సోయగాలను అనుభవించడం అంటున్నారు ఇక్కడ పెండ్లి చేసుకున్న దంపతులు. జీవితంలో ఒకేసారి జరిగే ఘనమైన వేడుకకు ఈ నగరం వేదికగా మారితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది.జర్మన్ సంస్కృతిలో ఎక్కువ వివాహలు ఇక్కడ జరుగుతాయి.

దుబాయి

Dubai
బంగారం పుష్కలంగా దొరికే ఇక్కడ..ఇసుక తిన్నెలు కూడాఉంటాయి. భూతల స్వర్గాన్ని తలపించే దుబాయిలో పెళ్లి చేసుకోవాలన్న కల అందరికి నిజం కాదు. కారణం ఖర్చు. ధనవంతులు అవలీలగా ఈ తంతు ఇక్కడ చేసుకోవచ్చు.

ఇటలీ

Italy
పురాతన కట్టడాలు, లెక్కలేనన్న చర్చిలు, చరిత్రపు ఆనవాళ్లుగా నిలిచిన ఆ గోడల మధ్య తాళి కడితే బంధం పదిలంగా ఉండడమే కాదు.. మనఃశ్శాంతిని కూడా ఇస్తుంది. విస్తారమైన ఆ ప్రదేశంలో రెండు మనసులు ఏకమవ్వడంలో కచ్చితత్వం ఉంటుంది.

521
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles