విమానాన్ని తయారుచేసి.. విహరించేసి!


Thu,May 9, 2019 11:07 PM

fayaz
ఆకాశంలో విహరించాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరికే సాధ్యమవుతుంది. సొంతంగా విమానం తయారుచేసుకోవాలని ఎంతమందికి ఉన్నా కొందరికే సాధ్యమవుతుంది. పాకిస్థాన్‌కు చెందిన పాప్‌కార్న్ వ్యాపారి విమానాన్ని తయారు చేసుకొని గాల్లో విహరిస్తున్నాడు.


మహమ్మద్ ఫయాజ్ పాకిస్థాన్‌కు చెందిన పాప్‌కార్న్ వ్యాపారి. అక్కడ ఆయన పేరు హాట్‌టాపిక్‌గా మారింది. చిన్నతనం నుంచి తనసొంతంగా విమానాన్ని తయారుచేసుకోవాలని కలలు కనేవాడు. ఆర్ధిక పరిస్థితి అంతంతే ఉండడం వల్ల చిన్నాచితక వ్యాపారాలు చేసుకుంటున్నాడు. ఎప్పటికైనా తన లక్ష్యాన్ని ముద్దాడాలనుకున్నాడు. ఆన్‌లైన్‌లో వీడియోలు చూస్తూ విమానాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడు. రిక్షా, పాత ఇనుప సామాను వంటి చాలా వస్తువుల్ని సేకరించి విమానం తయారు చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు పాప్‌కార్న్ అమ్ముతూనే పార్ట్‌టైమ్ సెక్యురిటీ జాబ్ కూడా చేసేవాడు. ఆస్తి కాగితాలు పెట్టి 50 వేల రూపాయలు రుణం కూడా తెచ్చాడు. చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అన్ని కష్టాలను అనుభవించి చివరకు విమానాన్ని తయారు చేశాడు. అతని పనితనాన్ని మెచ్చిన బంధువులు ఇప్పుడు ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. విమానాన్ని తయారుచేసి విహరించాలన్న తన కల ఎంతో దూరంలో లేదు. అతి త్వరలో తన గమ్యాన్ని ముద్దాడబోతున్నాడు.

416
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles