రైల్వేశాఖపై గెలిచాడు!


Fri,May 10, 2019 01:14 AM

sujeeth-swami
ఇండియన్ రైల్వే చేసిన తప్పుని ఒప్పుకొని ప్రయాణికుడికి 33 రూపాయలు తిరిగి ఇచ్చేసింది. రెండేళ్ల క్రితం పెట్టిన కేసు తుది తీర్పు వచ్చింది. ఆ కేసులో గెలిచిన ప్రయాణికుడు తన పంన్ని నెగ్గించుకున్నాడు. ఓ ఆసక్తికరమైన కథనమిది.


sujeeth-swami1

సుజిత్ స్వామి ప్రయాణికుడు. జీఎస్టీ అమలు కాకముందే టికెట్లు బుక్ చేసుకుంటే అందులో జీఎస్టీ అని వేశారు అధికారులు. 33రూపాయలు కట్టాడు. ఆ తర్వాత ఎందుకో అనుమానం వచ్చింది. ఎప్పుడూ లేనిది జీఎస్టీ అని వేశారు. అది ఇంకా అమల్లోకి రాలేదు కదా అని సందేహపడ్డాడు. ఆలస్యంగా నిజం తెలుసుకొని భారతీయ రైల్వేశాఖ మీద పోరాటం మొదలుపెట్టారు. తన డబ్బు చిన్న మొత్తమే అయినా తనలాగా ఎవరికీ అన్యాయం జరుగవద్దని గళమెత్తాడు. రెండేళ్ల పోరాటం అనంతరం సుజిత్ స్వామి 33 రూపాయలను గెలుచుకున్నాడు. 2017 ఏప్రిల్‌లో తన ప్రయాణం కోసం టికెట్ బుక్ చేసుకున్నాడు. అనివార్య కారణాల వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అందుకోసం టికెట్లను కూడా రద్దు చేసుకున్నాడు. క్యాన్సిలేషన్ చార్జీలు 65 రూపాయలు ఉండగా రైల్వే అధికారులు వంద రూపాయలను కట్ చేసుకున్నారు. మిగతా డబ్బులు ఏవని అడిగితే సర్వీస్ ట్యాక్స్ పేరుతో బుకాయించారు. ఆర్టీఐ సహకారంతో ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు తన 33 రూపాయలు గెలుచుకున్నాడు. అయినా సంతోషంగా లేనని చెప్తున్నాడు. తనకు ఇంకా రెండు రూపాయలు రావాలని,రైల్వే అధికారుల నుంచి పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదని అంటున్నాడు. తనతో పాటు తొమ్మిది లక్షల మంది ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నారని అందరి వద్ద సర్వీస్ ట్యాక్స్ పేరుతో వసూలు చేసిన డబ్బు సుమారు 3.34 కోట్లు అవుతుందని ఈ భారీ మొత్తాన్ని కూడా ప్రయాణికులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశాడు.

460
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles