తిన్న వెంటనే పడుకోవచ్చా?


Thu,May 16, 2019 01:14 AM

sleeping-lady
-సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయి. అందుకే అల్పాహారం తగినంత తీసుకోవాలి. రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటాం కాబట్టి ఆహారం స్వల్పంగా తీసుకోవాలి.
-నిద్రకు సమయం దగ్గర పడుతున్నప్పుడు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే రక్తంలో షుగర్, ఇన్సూలిన్ స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. దీంతో తొందరగా నిద్ర రాదు. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఏ చిరుతిళ్లు తినవద్దని వైద్యులు చెబుతున్నారు.
-కొంత మంది తియ్యటి పదార్థాలు ఫ్రిజ్‌లో నుంచి ఐస్‌క్రీంలు తీసుకుని తింటుంటారు. ఇది మరీ ప్రమాదకరం. దీనివల్ల షుగర్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇది మెల్టోనిన్ హార్మోన్‌ను తక్కువ చేస్తాయి. ఈ హార్మోన్లు అలసిపోయినట్లు విశ్రాంతి భావనను కల్పిస్తాయి. ఈ హార్మోన్లు తగ్గడం వల్ల మెదడుకు సంకేతాలు సరిగ్గా ఉండక నిద్ర పట్టదు.
-ఉదయం నిద్రలేచిన అరగంట తర్వాత అల్పాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారానికి 7 నుంచి ఏడున్నర అనువైన సమయం. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు భోజనానికి అనువైన సమయం. రాత్రి ఏడు గంటలు డిన్నర్‌కు అనువైన సమయం. ఎట్టిపరిస్థితుల్లో అర్ధరాత్రి తర్వాత భోజనం తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
-మధ్యాహ్నమైనా, రాత్రి సమయమైనా.. ఎన్ని పనులున్నా కొందరు తిన్న వెంటనే ఓ కునుకు తీస్తారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు వైద్యులు. బరువు తగ్గాలనుకునే వారు తిన్నవెంటనే కొద్ది సేపు నడిస్తే మంచిది. తిన్న వెంటనే నిద్రపోకుండా అరగంట వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

389
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles