ఓటర్లకి సందేశం


Thu,May 16, 2019 01:16 AM

ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా సందేశం ఇవ్వాలనుకుంటారు. అలా కొత్తగా చేయాలని సంకల్పించుకున్నది ఈ యువతి. పంజాబ్‌కి చెందిన ఈ అమ్మాయి డోలు వాయిస్తూ ఓటు ప్రాముఖ్యం గురించి అందరిలోనూ అవగాహన కల్పిస్తున్నది.
jahan
నేను మొదటిసారి ఓటు వేస్తున్నాను. మీలో ఓటు వేసేవారి మీద పెద్ద బాధ్యత ఉంది. పంజాబ్‌లో మే 19న లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరోజు చూపుడు వేలు మీద వేసే సిరా ఇంకే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. సంతోషంగా ఉండాలంటే కళ్లముందు జరిగే అనర్థాల్ని ఆపాలి అంటూ జహన్ గీత్ సింగ్ డోలు వాయిస్తూ ప్రచారం చేస్తుంది. ఈ డోలు ప్రచారం ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నది. జహన్ పంజాబ్ యూనివర్సిటీలో లా మీద డిగ్రీ చేసింది. 14 యేండ్ల వయసు నుంచేడోల్ వాయించడం నేర్చుకుంది. జహన్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. ఇప్పుడు యువతరం ఎవరు అధికారంలో ఉంటే వారికే మద్దతు పలుకుతున్నారు. యోగ్యత లేనివారికి రాజకీయాల్లో రాణించడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. కళ్లు తెరిచి తెలివిగా ఎంచుకోండి. అభ్యర్థి అందరికీ ప్రయోజనకరమో లేదో విశ్లేషించాలి. లేదంటే వారి పరిపాలనలోనే బతకాల్సి వస్తుంది అన్న జహన్ మాటలు అందరినీ ఆలోచింప చేస్తున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికలతో అందరిలో మార్పు వస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఓటర్ల మార్పుకు ఈ ప్రచారమే కారణమైతే అంత కన్నా ఆనందం లేదంటున్నది జహన్.

234
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles