హోంవర్క్ చేయిస్తున్న కుక్క!


Thu,May 16, 2019 01:20 AM

dad-trains-dog
జంతువులను మచ్చిక చేసుకొని, సరైన శిక్షణ ఇస్తే చాలు ఎలా కావాలంటే అలా నడుచుకుంటాయి. ఇంట్లో కొన్ని బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుంటాయి. అందుకు ఉదాహరణ ఈ పెంపుడు కుక్క.

చైనాకు చెందిన జూలియాంగ్‌కు ఓ పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్కకు ఓ బాధ్యతను అప్పగించాడు జూ లియాంగ్. ఆయన కుమార్తె హోం వర్క్ పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేస్తుంది. లియాంగ్ కూడా ఆమెకు చాలాసార్లు హోంవర్క్ పూర్తి చేయకుండా, ఏ పని చేయొద్దని చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే అంటూ, తండ్రి ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే హోంవర్క్ మధ్యలోనే వదిలేసి ఆడుకునేది. ప్రతీసారి జూలియంగ్ ఎదురుగా కూర్చోలేడు. కనుక తన పెంపుడు కుక్కకు కుమార్తెతో హోంవర్క్ చేయించడంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. ఒకవేళ ఆమె హోంవర్క్ చేయకపోతే గట్టిగా మొరుగుతుంది. ఇంటి యజమానికి ఆమె హోం వర్క్ చేయలేదనే విషయాన్ని భౌ..భౌ అంటూ అరవడం ద్వారా తెలియజేస్తుంది. ఈ కుక్కకు పెట్టిన ఆహారాన్ని ఓ పిల్లి లాక్కుని వెళ్లేది. తన ఆహారాన్ని పిల్లి నుంచి కాపాడుకోవడానికి జూలియంగ్ తర్ఫీదు ఇచ్చాడు. అదేవిధంగా హోంవర్క్ చేయించడంలోను ప్రత్యేకంగా కుక్కకు శిక్షణ ఇచ్చాడు. గతంలో హోంవర్క్ చేయాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, ఇప్పుడు కుక్కతో కలిసి హోంవర్క్ చేయడం చాలా బాగుందని చెబుతున్నది జూలియంగ్ కుమార్తె. అయితే జూలియంగ్ తండ్రి ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో నెటిజనులంతా ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు.

315
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles