భూగోళాన్ని చుట్టేసి..శాంతికి కృషి చేసి!


Fri,May 31, 2019 01:29 AM

ఆమె తిరుగని దేశం లేదు. ఆమె చూడని ప్రదేశం ఉండదు. . 27 యేండ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టేసింది. భూగోళమంతా చుట్టేసిన ఆ అమ్మాయి పరిచయమిది.
Cassie-De-Pecol
భూమండలం మీదున్న ప్రతీదేశాన్ని చుట్టేసింది. ఇలా అన్ని దేశాలు చుట్టేసిన మొదటి మహిళగా రికార్డుల్లోకెక్కింది. కొందరు ప్రయాణాలను యాత్రలుగా భావిస్తే కొందరు బాధ్యత అనుకుంటారు. కాస్సీ డీ పెకోల్ ప్రయాణాన్ని సర్వస్వంగా భావించింది. అతిపిన్న వయసులో 196 దేశాలు సందర్శించి రికార్డుల్లోకెక్కాలనుకున్నది. 2015 సంవత్సరం నాటికి 181 దేశాలు చుట్టేసింది. 40 రోజుల్లో 15 దేశాలను అతి వేగంగా చుట్టేసిన వ్యక్తిగా కూడా రికార్డు బ్రేక్ చేసింది. 196 దేశాలు తిరిగింది సరదా కోసం కాదని, ప్రపంచశాంతికి సంబంధించిన కారణాలు తెలుసుకోవడం కోసమని చెప్తుంది. ఇంటర్‌నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్ త్రూ టూరిజం సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నది. తను చేస్తున్న ప్రయాణానికి సాహసయాత్ర 196 అని పేరు పెట్టింది.ప్రతిచోటకు కెమెరా వెంటపెట్టుకొని వెళ్తుంది. వెళ్లిన చోట చిత్రాల్ని బంధించి ఇన్‌స్టగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుంది. ప్రతి చిత్రానికి ఒక స్టోరీ రాస్తుంది. భూగోళాన్నంతా చుట్టేసి శాంతి స్థాపనకు కృషి చేస్తున్న కాస్సీ డీ పెకోల్‌ను అందరూ అభినందిస్తున్నారు.

524
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles