ప్రయాణం.. ఒత్తిడి దూరం


Fri,May 31, 2019 01:31 AM

డిప్రెషన్ తగ్గాలంటే చాలా మంది చేసేది ప్రయాణం. ఈ విషయం చాలామందికి తెలిసినా నిర్లక్షం వల్ల పట్టించుకోరు. ప్రయాణం చెయ్యడం వల్ల డిప్రెషన్ తగ్గుతుందని చెప్పడానికి చాలా కారణాలున్నాయి.వాటిలో కొన్ని..
mantas-hesthaven
ఒంటరిగా ఉన్నప్పుడే నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు డిప్రెషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రయాణాలు చేయడం వల్ల డిప్రెషన్‌కు వెళ్లే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కారణం ఎక్కువ మందిని కలుస్తుంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికుల నుంచి మొదలు డ్రైవర్, హోటల్ సిబ్బంది ఇలా కొత్త ముఖాలను చూసే అవకాశం ఉంటుంది. వారితో పరిచయం ఏర్పడి మాట్లాడే అవకాశం దొరికితే ఇంకా మంచిది. ప్రతి ఒక్కరికీ రకరకాల కథలుంటాయి. అవి పంచుకుంటే కొంత బాధ తగ్గుతుంది. వెళ్లేదేదో ప్రకృతికి దగ్గరగా వెళ్తే ఇంకా మంచిది. దట్టమైన అడవులు, నదులు, పర్వతాలు, ప్రశాంతతనిస్తాయి. ప్రకృతికి దగ్గరయితే డిప్రెషన్ దానంతట అదే మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఇదొక శక్తివంతమైన మార్గంగా చెప్పొచ్చు. వీలైతే ప్రయాణాల్లో ట్రెక్కింగ్, రాక్ ైక్లెంబింగ్, సైక్లింగ్ వంటి శారీరక శ్రమను కలిగించే పనులు చేయండి. ఆరోగ్యంతో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది. నిద్ర కావాలంటే గాడ్జెట్స్‌కు దూరంగా ఉండండి. మీరు వెళ్లిన ప్రదేశం గురించి లోతుగా అధ్యయనం చేయండి.

1028
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles