పోలీస్ సార్! హెల్ప్ చేస్తారా?


Sun,June 30, 2019 01:21 AM

మా దేశ పౌరులకు ఎలాంటి సాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఆన్‌లైన్ వేదికగా మీ సమస్యను మాతో పంచుకోవచ్చు అని అమెరికాలో పోలీసులు ప్రజలకు దగ్గరవ్వడానికి సరికొత్తగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ చిన్నారి ఏకంగా తనకు ఎదురైన హోం వర్క్ సమస్యను పరిష్కరించాలని పోలీసులను కోరింది. ప్రస్తుతం ఆ పోస్టు సామాజిక మాద్యమాల్లో సంచలనమవుతున్నది.
Leena-maths
గణితమంటే చాలామంది చిన్నారులకు భయం. స్కూల్ టీచర్ ఇచ్చే హోం వర్క్‌ను చేసేందుకు పిల్లలు నానా తంటాలు పడుతుంటారు. అవసరమైతే పేరెంట్స్ హెల్ప్ అడుగుతారు. ఈ క్రమంలో అమెరికాలోని ఓహియోకు చెందిన ఓ చిన్నారి తనకు హోం వర్క్ చేయమని టీచర్ ఇచ్చిన లెక్కలను సాల్వ్ చేయాలంటూ పోలీసులను కోరింది. ఓహియోలోని లీనా డ్రేపర్ అనే ఓ చిన్నారి స్థానికంగా రెండో తరగతి చదువుతున్నది. టీచర్ ఇచ్చిన లెక్కలను సాల్వ్ చేయమని ఫేస్‌బుక్ మెసెంజర్‌లో స్థానిక పోలీసులను కోరింది. అందుకు సమాధానమిస్తూ పోలీసులు లెక్క ఏంటని అడిగారు. అయితే మొదట లీనా వేసిన ప్రశ్నకు గ్రబర్ అనే పోలీసు అధికారి సమాధానం ఇచ్చాడు.


దీంతో ఆ చిన్నారి హ్యాపీగా ఫీలయ్యింది. అయితే ఆమె అంతటితో ఆగలేదు. మరో లెక్క చేయాలని కోరగా పోలీసు అధికారి లెక్క చేసి మెసెంజర్‌లో పెట్టాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను లీనా తండ్రి స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఆ పోస్టు కాస్త వైరల్ కావడంతో ఫేస్‌బుక్‌లో దాదాపు 30 వేల మంది షేర్ చేశారు. ఏదేమైనా లెక్కలు రాకపోతే పోలీసులను హెల్ప్ అడగాలనే చిన్నారి బుర్రకు ఆలోచన వచ్చినందుకు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ఆ పోస్టును షేర్ చేస్తున్నారు.

1602
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles