సమయాన్ని ఆదా చేయండి


Thu,July 18, 2019 12:58 AM

-ఇకనుండి ప్రతిరోజు మొబైల్ వాడకాన్ని అరగంటకు మాత్రమే పరిమితమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. రోజులో పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు వాడేలా ప్లాన్ చేయాలి. కేటాయించిన సమయాల్లో మనకు వచ్చిన ముఖ్యమైన కాల్స్, మేసేజ్‌లకు రిైప్లె ఇవ్వాలి.
Time-management
-అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని మొదలు పెట్టేటప్పుడు మన మొబైల్ ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో ఉంచడం చాలా మంచిది. ఎందుకంటే ఒక పనిని మొదలు పెడతాం. ఏదో ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం వల్ల మనసు అటువైపు డిస్ట్రాక్ట్ అయ్యి చేయాల్సిన పని మీద ఏకాగ్రతను కోల్పోతాం. ఇలా ప్రతి ఒక్కరికీ జరిగే ఉంటుంది.
-కొంతమంది చిన్న పనిని సైతం చాలా పర్‌ఫెక్ట్‌గా చేయాలనుకుంటారు. కానీ ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇలా సమయాన్ని వృథా చేస్తుంటారు. కాలపరిమితిని ముందే విధించుకొని పని మొదలుపెడితే సమయం వృథా కాకుండా ఉంటుంది.
-మల్టీ టాస్కింగ్ అనేది మంచి గుణమే. ఒకరిలా ఉండడానికి ప్రయత్నించి తప్పులు చేయకూడదు. అలా తప్పులు చేసి ఈజీగా పూర్తి చేయాల్సిన పని కోసం సమయం వృథా చేయడం మంచిది కాదు.

357
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles