ఆడవే మగ చేపలవుతున్నాయి!


Thu,July 18, 2019 12:59 AM

ఈ రోజుల్లో పురుషులు, స్త్రీలుగా మారిపోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకు రకరకాల శస్త్ర చికిత్సలున్నాయి. కానీ ఎటువంటి ఆపరేషన్‌లేకుండానే ఆడ చేపలు మగ చేపల్లా మారిపోతున్నాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం ఓ విశేషమే.
fish-transforms
ఇటీవల కొందరు ఆడవారు మగవారిలా, మగవారు ఆడవారిలా మారుతున్నారు. కొన్ని చేపల్లో మాత్రం ఎటువంటి శస్త్రచికిత్సలతో పని లేకుండానే లింగమార్పిడి జరుగుతున్నది. న్యూజిలాండ్‌లోని ఒటాగో శాస్త్రవేత్తలు లింగమార్పిడి చేసుకునే చేపలపై ప్రత్యేకంగా పరిశోధనలు జరిపారు. నీలి రంగు తల ఉండే వ్రస్సే, క్లోన్‌ఫిష్‌ జాతికి చెందిన ఆడ చేపలు మధ్యవయసులో మగ చేపలుగా మారుతున్నాయట. ఇదే విషయాన్ని పరిశోధనా బృందంలోని సభ్యుడైన ఎరికా టడ్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. మొదట్లో ఆడ చేపలు మగ చేపలతో కలిసి జీవిస్తాయి. మగ చేప చనిపోయిన తర్వాత వాటి జీవన ప్రక్రియ పూర్తిగా మారిపోతుంది. పరిస్థితులకు అనుగుణంగా అది నెమ్మదిగా మగ చేపలా ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత వాటిలో గర్భం దాల్చేందుకు ఉపయోగపడే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ‘అరోమాటసీ’ ఉత్పత్తి నిలిచిపోతుంది. అనంతరం శరీర మార్పులు జరుగుతాయి. వృషణాలు ఏర్పడి పూర్తిగా మగ చేపల్లా మారిపోతున్నాయట. అవి నెమ్మదిగా మగ చేపల్లా ఆడ చేపలతో ప్రత్యుత్పత్తిలో పాల్గొంటున్నట్టు పరిశోధకులు తేల్చారు.

520
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles