విచిత్ర వజ్రాల బావి!


Thu,July 18, 2019 01:02 AM

కాల గర్భంలో కలిసిపోయిన రహస్యాలు చాలానే ఉన్నాయి. అటువంటి రహస్యాలు ఇప్పటికీ అంతు చిక్కకుండా మిస్టరీలుగానే మిగిలి పోయాయి. ఓ అటవీ ప్రాంతంలో విచిత్ర బావి ఉన్నది. అది వింత బావిగా ఎందుకు మారిందో తెలుసా!
diamond-well
అసోంలోని గౌహతికి దక్షిణ దిశలో 80 మైళ్ల దూరంలో ఎత్తైన కొండపై ఓ వింత బావి ఉన్నది. అక్కడి గిరిజనులు దానిని వజ్రాలకొండగా పిలుస్తారు. ఆ బావికి ఓ కథ ఉన్నది. పూర్వం ఆ కొండ ప్రాంతంలో దేవతల రాజు ఇంద్రుడికి వక్రాసుడు అనే రాక్షసుడికి భయంకరమైన యుద్ధం జరిగిందట. ఆ సమయంలో ఇంద్రుడి వజ్రాయుధం పొరపాటుగా నిలువుగా ఆ కొండ మీదకి జారడంతో దాని ప్రభావంతో కొండ లోపల మరొక బావి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ బావి ఆకృతి ఆయుధం అచ్చు పడినట్లుగా కనిపిస్తుందట. అలా పడిన వజ్రాయుధాన్ని ఇంద్రుడు తన చేతిలోకి తీసుకుని ఆ రాక్షసుడిని వధించాడట. ఆ సమయంలో రాక్షసుడి తలతోపాటు వజ్రాయుధం బావిలోనే పడిపోయాయట. వజ్రాయుధం బావిలో పడడం వల్ల ఇప్పటికీ అందులో వజ్రాలు దొరుకుతాయని చెబుతుంటారు. అందులోకి వెళ్లడానికి ప్రత్యేకంగా మెట్లు లేవు. పెద్ద పెద్ద గోడలు మాత్రమే ఎక్కడానికీ, దిగడానికీ అనువుగా ఉంటాయి. ఈ బావి గురించి తెలుసుకున్న వారు వజ్రాలు తెచ్చుకోవచ్చనే ఆశతో వెళుతుంటారు. కానీ అలా వెళ్లిన వారెవరి శవం కూడా లభ్యం కాలేదు. అసలు అక్కడికి వెళ్లిన వారెందుకు కనిపించకుండా పోతున్నారో ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.

747
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles