భార్యను మోసే పోటీలు !


Thu,July 18, 2019 01:04 AM

ప్రతి ఏటా ఓ దేశంలో భార్యను మోసే పోటీలు జరుగుతాయి. మోయడమంటే అంత సులువేం కాదు. సాహసంతో కూడిన పోటీలనే చెప్పాలి. ఎందుకంటే అందులో ఉండే షరతులు అలా ఉంటాయి మరి. ఇంతకీ ఎక్కడంటే?

champions
ఫిన్‌ల్యాండ్‌లో భార్యను మోసే పోటీలు నిర్వహిస్తుంటారు. 24ఏండ్లుగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఎంపిక పోటీలు (ప్రిలిమినరీస్‌) కూడా ఉంటాయి. వెబ్‌సైట్‌ల ద్వారా ప్రచారం చేసి.. ప్రిలిమినరీస్‌ నిర్వహించి అందులో ఎంపికయిన వారిని మాత్రమే ఫైనల్స్‌కు పంపిస్తారు. ఫైనల్స్‌ ఫిన్‌ల్యాండ్‌లో జరుగుతాయి. పోటీల్లో భాగంగా భార్యను మోసుకుంటూ 253.5 మీటర్ల దూరం వరకూ పరిగెత్తాల్సిఉంటుంది. నీళ్లు, బురద గుంటలను దాటుకుంటూ ఆమెను నేలకు తగలకుండా నిర్దేశించిన లక్ష్యం వరకూ తీసుకెళ్లాలి. అలా ఎవరు తక్కువ సమయంలో టార్గెట్‌ రీచ్‌ అవుతారో వారిని విజేతలుగా ప్రకటిస్తారు. 19 వ శతాబ్దానికి చెందిన రాంకైనెన్‌ రాబర్‌ అనే దొంగ కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. దొంగతనాలకి పనికి వస్తారో లేదో తేలుసుకోవడానికి రాంకైనెన్‌ ఇటువంటి పోటీ పెట్టేవాడట. మొదట్లో జరిగిన పోటీల్లో ధాన్యం కానీ, బతికి ఉన్న పందుల్ని గానీ మోసేవాళ్లట. ప్రస్తుతం ఆ పోటీలే భార్యను మోసుకెళ్ళే పోటీలుగా మారాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి, చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడకు వస్తారు. ఈ ఏడాది పోటీల్లో మొత్తం 12 జంటలు పాల్గొన్నాయి. వారిలో వైటాటాస్‌ కిర్క్లియాస్కాస్‌, అతని భార్య నెరింగా కిర్క్లియాస్కీన్‌ విజేతలుగా నిలిచారు. వీరి జంట ఈ పోటీలో గెలువడం వరుసగా రెండోసారి. గతంలో ఆరుసార్లు విజేతలుగా నిలిచిన టైస్టో మియెట్టినెన్‌,కట్జా కోవనెన్‌ జంటపై ఈ ఏడాది వైటాటాస్‌ కిర్క్లియాస్కాస్‌ దంపతులు విజయం సాధించారు. అది కూడా తక్కువ సమయంలో అంటే కేవలం 0.1 సెకన్లు తేడాతో గెలువడం విశేషం.

1119
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles