కాలుష్యాన్ని అరికట్టడమే బాధ్యతగా!


Thu,July 18, 2019 01:04 AM

అంతటితో ఆగకుండా ఫ్యాక్టరీలో వెలువడే వ్యర్థ పదార్థాలను డ్రైనేజ్‌లో కలుపుతూ మరింత నష్టం కల్పిస్తున్న ట్యాంకర్ డ్రైవర్‌ను సాక్ష్యాధారాలతో పోలీసులకు అప్పజెప్పిందో మహిళ.

revathi
కర్ణాటకకు చెందిన భీమపుత్రి బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు రేవతి రాజ్ మైసూర్ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తుండేది. అలా ఆ ప్రయాణంలో రాజా కలువే అనే కాలువ వద్దకు రాగానే చెడు వాసన వస్తుండడం పసిగట్టింది. రేవతి తన స్నేహితులతో కలిసి రెండు రోజులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రాంతంలోని మెట్రో కార్మికులు ట్యాంకర్లను తీసుకొని వచ్చి రసాయనాలను నీటిలో కరిగించి కాలువలోకి విడుదల చేస్తున్నారు. వీరిని పోలీసులకు సాక్ష్యాధారాలతో పట్టించాలనుకున్నది రేవతి. వారంరోజుల తర్వాత తెల్లవారుజామున ట్యాంకర్ కాలువవైపు వెళ్తున్నట్లు గమనించింది. ట్యాంకర్‌ను అనుసరిస్తూ ఆమె కూడా వెళ్లింది. డ్రైవర్ ఆమెను చూసి ట్యాంకర్ వదిలేసి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ట్యాంకర్‌లో దాదాపు 12,000 లీటర్ల రసాయన కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. ఈ సంఘటన గురించి బైతారాయణపుర స్టేషన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆ కేసును పట్టించుకోలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నా దగ్గరే ఉంది. మీరు గనుక యాక్షన్ తీసుకోకపోతే పై అధికారుల వద్దకు తీసుకెళ్తాను అని పోలీసులతో ధైర్యంగా మాట్లాడింది. దీంతో పోలీసులు ట్యాంకర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగించారు. రేవతి ధైర్య సాహసాలకు కర్ణాటక ప్రజలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

389
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles