చీర కట్టు.. ఫొటో పెట్టు..


Thu,July 18, 2019 01:08 AM

సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కొన్ని చాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ట్విట్టర్‌లో ఓ చాలెంజ్ సాగుతున్నది. అదే సారీ ట్విట్టర్ చాలెంజ్!

saree-challenge

ఎంత మోడ్రన్ డ్రెస్‌లు అయినా చిన్నబోవాల్సిందే చీరకట్టులో. ఇలాంటి చీరకట్టును ట్రెండ్ చేసి అలవాటులేని వాళ్లతో కూడా చీరకట్టిస్తే ఎలా ఉంటుంది. ఇదో చాలెంజ్‌లా స్వీకరిస్తే చీరకట్టుపై కొత్తవాళ్లకు ఆసక్తి పెరుగుతుంది కదా! ట్విట్టర్ వేదికకగా ఈ చాలెంజ్ నడుస్తున్నది. #SareeTwitter హ్యాష్ ట్యాగ్‌తో వారం రోజులుగా ఈ చాలెంజ్ వైరల్ అవుతున్నది. విదేశీయులు కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించి చీరకట్టు ఫొటోలు ట్వీట్ చేస్తున్నారు. సెలెబ్రెటీలు, వీఐపీలు సైతం ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. దీంతోపాటు #JhumkaTwitter చాలెంజ్ కూడా ఉంది. అమ్మాయిలు అందమైన జుంకాలు ధరించి ఆ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. దానికి అబ్బాయిలు స్పందిస్తూ పగ్‌డీ (తలపాక) ధరించి ఫొటో పెడుతున్నారు. #paghditwitter హ్యాష్ ట్యాగ్‌తో ఈ చాలెంజ్ నడుస్తున్నది. ఇట్లా వారి వారి సంప్రదాయ కట్టును తెలిపేందుకు ఆయా ప్రాంతాల వారు ఈ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు.

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles