గొంతులో కిచ్ కిచ్!


Thu,July 18, 2019 01:12 AM

గొంతులో కిచ్‌కిచ్‌గా ఉందా.. ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా తగ్గట్లేదా.. టీవీల్లో వచ్చే యాడ్స్ చూసి ఆ మందులు వాడినా తగ్గట్లేదా.. వంటింట్లోని పదార్థాలతో గొంతునొప్పిని తగ్గించుకోవచ్చు. ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి.

Sore-Throat

-గొంతులో ఇబ్బందిగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. ప్రతీ మూడు గంటలకోసారి తీసుకుంటూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు త్వరగా నయమవుతాయి.
-దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి క్రమం తప్పకుండా రెండు రోజులు తీసుకుంటే గొంతులో కిచ్‌కిచ్ తగ్గిపోతుంది.
-బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. దాల్చిన చెక్క పొడి చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. తేనె, దాల్చినచెక్క పొడిని సమానంగా తీసుకుని సమస్య ఉన్న చోట పూస్తే ఎగ్జిమా, ఇతర స్కిన్ ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
-తేనె, దాల్చినచెక్క పొడిని పేస్టు మాదిరిగా చేసుకొని పడుకునే ముందు ముఖానికి పట్టించాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు మొత్తం మటుమాయమవుతాయి.
-రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కంటే అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించి తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

879
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles