అందంగా కనపడాలంటే


Fri,July 19, 2019 12:37 AM

అందంగా ఉండాలని కోరుకోని వారుండరు. అందం కోసం ప్రయత్నాలు చేయని మగువలఉండరు. అయితే అందం కోసం వేలకు వేలు వెచ్చించాల్సిన అవసరం లేదు. వంటింట్లో దొరికే వాటితో ఈ చిన్న చిట్కాలను పాటిస్తే చాలు.
beauty
-దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బాగా ఉంటాయి. దాల్చిన చెక్క పొడి, నీటిని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా వారంలో మూడు రోజులు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ వారు దీనికి దూరంగా ఉండండి.
-మొటిమలను పోగొట్టే శక్తివంతమైన పదార్థాల్లో టీ ట్రీ ఆయిల్ ఒకటి. కానీ, ఇది ఎంతో స్ట్రాంగ్. అందుకే చర్మంపై ఎక్కువ సేపు టీ ట్రీ ఆయిల్ ఉంటే, దుష్ప్రభావాలు చూపే ప్రమాదం ఉంది. కాబట్టి పదిహేను నిమిషాల్లోనే టీ ట్రీ ఆయిల్‌ను చర్మం నుంచి తొలగించాలి.
-వంటింట్లో తప్పక ఉండే పదార్థాల్లో పసుపు ఒకటి. పసుపును చర్మంపై ఐప్లె చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే చాలామంది ఫేస్‌ప్యాక్‌లలో పసుపుని తప్పకుండా జోడిస్తారు. పసుపు వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొaగుతాయి. ప్రతిరోజూ స్నానానికి ముందు పచ్చిపాలలో కాస్తంత పసుపు వేసుకుని ముఖానికి ఐప్లె చేయాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.
-నిమ్మకాయ రసం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే చాలామంది స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌లో నిమ్మరసాన్ని వాడుతారు. నిమ్మకాయ అసిడిక్ కాబట్టి చర్మంపై ప్రతికూలంగా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగితే చర్మం కాంతివంతమవుతుంది.
-రోజులో కనీసం పదిసార్లు సబ్బు వాడకుండా ముఖం కడుక్కోవాలి. తరుచూ కడుగడం వల్ల ముఖం కాంతిమంతంగా మారుతుంది. ముఖంపై పేరుకున్న దుమ్ము, ధూళి తొలగిపోతుంది.

548
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles