ఎంఐ నుంచి నెక్ ఇయర్ ఫోన్స్


Wed,July 24, 2019 12:36 AM

new-gadget
వరుసగా మొబైల్‌లను విడుదల చేస్తూ ఇతర కంపెనీలకు పోటీగా నిలుస్తున్న ఎంఐ కంపెనీ ఆడియో యాక్సెసరీలను కూడా విడుదల చేస్తున్నది. వైర్డ్, వైర్లెస్ యాక్సెసరీలను అందుబాటులోకి తెస్తూ క్రేజ్ సంపాదిస్తున్నది.


కొద్ది రోజుల కిత్రమే రూ. 1799 ధరతో సూపర్ బేస్ హెడ్‌ఫోన్ విడుదల చేసింది. తాజాగా మరో బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిన్ననే దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది నెక్ బ్యాండ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్. మైక్రో ఆర్క్ కాలర్ డిజైనింగ్‌తో ఆకట్టుకుంటుంది. బ్లూటూత్ 5.0, ఫాస్టర్ కనెక్టివిటీ, ట్రైబ్యాండ్ ఇక్వలైజేషన్, ఎనిమిది గంటల బ్యాటరీ ఫీచర్లతో ఉంది. ధర రూ. 1599గా కంపెనీ నిర్ణయించింది.

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles