మీ మొబైల్ నెట్ స్లోనా ఏంటీ ?


Wed,July 24, 2019 12:39 AM

tip-top
స్మార్ట్‌ఫోన్‌లో ఎంత మంచి నెట్‌వర్క్ ప్లాన్ వాడినా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెడతుంది. అలాంటప్పుడు కింద ఉన్న టిప్స్ వాడితే కొంత ఉపయోగం ఉంటుంది. ప్రయత్నించండి.


- రోజూ కొన్ని గంటలు గంటలూ బ్రౌజింగ్ చేస్తాం. హిస్టరీ, కాస్ ఫైల్స్ నిండిపోతాయి. వీటిని ఎప్పటికప్పుడూ క్లియర్ చేయాలి. లేకపోతే మెమొరీ మొత్తం ఆక్రమించి మొబైల్ కూడా స్లో అవుతుంది. దీని కోసం ఫోన్‌లో అయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో క్లీయర్ కాస్‌పై క్లిక్ చేయండి. బ్రౌజర్‌లో అయితే సెట్టింగ్స్‌లో క్లియర్ బ్రౌజింగ్ డాటా ఉంటుంది.
- అనవసర యాప్‌లు మీ మొబైల్లో ఉంటే అన్ ఇన్‌స్టాల్ చేయండి. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయి డేటాను, చార్జింగ్‌ను తింటాయి. రన్నింగ్‌లో లేకపోయినా నెట్‌తో సంబంధం కలిగి ఉంటాయి. వాటికి డేటా రిస్టిక్ట్ చేయాలి. దీని కోసం సెక్యూరిటీ ఆప్షన్‌లోకి వెళ్లి, డేటా యూజెస్ ద్వారా రిస్టిక్టెడ్ డాటా అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీనిపై క్లిక్ చేయగానే మొబైల్ డేటాను తీసుకునే ఆప్స్ అన్నీ కనిపిస్తాయి. వాటిపై ఆకుపచ్చ రంగులో రైట్ మార్క్ ఉంటే అది డేటా తీసుకుంటుందని అర్థం. దాని మీద క్లిక్ చేస్తే రెడ్ కలర్ క్రాస్ మార్క్ వస్తుంది. అప్పుడు దానికి డేటా నిలిచిపోతుంది. ఇలా డేటా సేవ్ అవటంతో పాటు నెట్ పర్ఫామెన్స్ కూడా పెరుగుతుంది.
- మీరు మారుతున్న ప్రాంతాన్ని బట్టి నెట్‌వర్క్ రేంజీ మారుతుంటుంది. ఇప్పుడు విస్తరించిన నెట్‌వర్క్‌నేపథ్యంలో అంతా 4జీ అందుబాటులో ఉంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఒక్కోసారి 4జీ రాకపోవచ్చు. మీ నెట్‌వర్క్ 4జీ అయినప్పటికీ అలాంటి ప్రాంతాల్లో 3జీ లో పెట్టుకుని డేటాను వినియోగించుకోవాలి. అప్పుడే 3జీ నెట్‌వర్క్ అనుగుణంగా స్పీడ్ ఉంటుంది.
- ఒపెరా మినీ, యూసీ బ్రౌజర్, క్రోమ్ బ్రౌజర్లు ఆండ్రాయిడ్‌లో చాలా ఫాస్ట్‌గా రన్ అవుతాయి. వీటిని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.

249
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles