అందానికి, ఆరోగ్యానికి దంతాలు


Tue,July 30, 2019 12:39 AM

Panitanam
దేహంలోని అత్యంత పటిష్ఠమైన పదార్థంతో తయారైనవే నోటి దంతాలు. ఇవి ముఖసౌందర్యానికి, దేహారోగ్యానికి ఎంతో ముఖ్యం. పండ్లు లేనివారికే వాటి విలువ, లోటు, పనితనం తెలుస్తాయి. మనం తినే ఆహారాన్ని ముక్కలుగా చేసి, గుజ్జులా మార్చుకోవడానికి ఇవి తప్పనిసరి. మాట స్పష్టంగా పలుకడానికీ దంతాలు బాగా ఉపయోగపడుతై. ఇవి లేకపోతే దవడలు దగ్గర పడి, చెంపలు చూడడానికి వికారంగా, ముఖం వృద్ధాప్య ఛాయలను సంతరించుకొంటుంది. దంతాలు నాలుగు రకాలు (ముందరి లేదా కత్తెర పళ్లు, కోరపళ్లు, రెండు బుడిపెల పళ్లు, నమిలే దవడ పళ్లు). నోటిలోని వీటి మూలాలు పై దవడ, దిగువ దవడల్లో ఉంటాయి. బిడ్డ పుట్టిన కొద్ది నెలలకే తొలిదశలోని పాలపండ్లు వస్తాయని నిపుణులు అంటారు. కొందరికైతే పుట్టుకతోనే ఒకటో, రెండో పండ్లుంటాయనీ వారన్నారు. పంటిమీది తెల్లని ఎనామిల్ గట్టి ఖనిజమైన క్యాల్షియమ్ ఫాస్ఫేట్‌తో తయారవగా, దీని కింది పొర (డెంటిన్)లో అతిసూక్ష్మ వాహకాలు, దృఢమైన కణజాలం ఉంటాయి. లోపలి భాగంలోని మృదువైన పదార్థం (పల్ప్)లోనే రక్తనాళాలు, నాడులు ఉంటాయి. వయోజనుల్లో మొత్తం 32 పండ్లు (8 కత్తెరపండ్లు, 4 కోరపళ్లు, 8 రెండు బుడిపెల పండ్లు, మరో 8 నమలడానికి పనికి వచ్చే పండ్లు, 4 జ్ఞానదంతాలు) ఉంటాయి. చాలావరకు పండ్ల మనుగడ అంతా నోటి చిగుళ్ల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది.

144
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles