పెద్దపులుల పట్ల పెద్దమనసు


Tue,July 30, 2019 12:40 AM

TIGER
2010 నుంచి ప్రతీ సంవత్సరం జూలై 29న అంతర్జాతీయ టైగర్ డేని జరుపుకుంటున్నాం. పెద్ద పులులు ఎంత వన్యమృగాలైనా ప్రకృతిపట్ల మనుషులంత ప్రమాదం మాత్రం కావు. వీటి పరిస్థితి ఇప్పుడు ఎంత దయనీయంగా తయారైందంటే, ఒక అంచనా (2016లోని అధ్యయనం) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య కేవలం 3900 మాత్రమే. 20వ శతాబ్ది ఆరంభం నుంచీ నేటికి (ఈ వందేండ్లలో) దాదాపు 95 శాతం పులులు నశించిపోగా, ఇప్పుడు మిగిలినవి ఆ అయిదు శాతమే. పెద్దపులుల పట్ల మనం పెద్ద మనసు చేసుకోవడానికి ఇంతకంటే మంచి సమయం వస్తుందా? ఇంత పెద్ద జంతుజాతి కేవలం మానవ తప్పిదాల వల్ల వినాశనమై పోయిందన్న అపవాదు మానవజాతికి అవసరమా? క్షీణించిపోతున్న పులుల సంఖ్య నేపథ్యంలో రష్యాలోని ఓడరేవు పట్టణమైన సెయింట్ పెటర్స్‌బర్గ్‌లో 2010లో జరిగిన టైగర్ సమిట్‌లో ఈ మేరకు ప్రతి ఏడాది జూలై 29ని పెద్దపులి దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అప్పట్నుంచీ పెద్దపులుల సంరక్షణపట్ల ప్రజలలో అవగాహన పెరుగుతున్నా ఇది చాలదు. వీటి సంఖ్య రాబోయే మరో రెండేండ్లలో రెట్టింపు అయినా కావాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

241
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles