నగరాలకు ఉష్ణోగ్రతల ముప్పు


Tue,July 30, 2019 12:41 AM

వాతావరణంలోని ఉష్ణోగ్రతలు ఇలాగే పెచ్చుమీరి పోతుంటే మరో మూడు దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా వున్న వందలాది నగరాల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారు కాగలదని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Paryavaranam
నగర జీవితం ఎంత సుఖమో కదా అనుకొని మురిసిపోయే రోజులు పోయాయి. పల్లెల్లోని ప్రాకృతిక ప్రశాంతత పట్నాల్లో ఎక్కడిది? కాంక్రీటు పరిసరాలకు తోడు అనూహ్య శిలాజ ఇంధన వాడకాలు వాయుకాలుష్యాన్ని పెంచి పోషిస్తున్న దశలో గోరుచుట్టు మీద రోకలిపోటులా రానున్న కొద్ది దశాబ్దాలలో వాతావరణ ఉష్ణోగ్రతలు అనూహ్య స్థాయిలో పెరగనున్నట్లు శాస్త్రవేత్తలు ఘాటుగా హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2050 కల్లా ప్రపంచంలోని మొత్తం 520 ప్రధాన నగరాలలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉన్నదని వారు అంటున్నారు. అప్పుడు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్న నగరాల పరిస్థితే మిగిలిన అనేక సిటీలకు కలుగవచ్చునని వారు తెలిపారు. ఉదా॥కు బార్సెలోనా (స్పెయిన్) మాదిరిగా లండన్ (ఇంగ్లాండ్), ప్యారిస్ (ఫ్రాన్స్)ను మించిపోయి ఎడిన్‌బర్గ్ (స్కాట్లాండ్), మెల్బోర్న్ (ఆస్ట్రేలియా)లా లీడ్స్ (ఇంగ్లాండ్), మోంటెవీడియో (ఉరుగ్వే)వలె కార్డిఫ్ (యుకె) నగరాలు తీవ్రస్థాయిలో వేడెక్కి పోతాయని వారు అంటున్నారు.

246
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles