అవి ఎక్కువైనా, తక్కువైనా కష్టమే!


Tue,July 30, 2019 12:42 AM

FOOD
పిండి పదార్థాలు (Carbohydrates) శరీరానికి ఎంత అవసరమో అంతే ఉండాలి. ఎక్కువైనా, తక్కువైనా కష్టమేనని నిపుణులు చెప్తారు. లోటు ఏర్పడినప్పుడు కానీ లేదా అవి ఎక్కువైనప్పుడు కానీ వీటి ప్రభావం దేహంపై చాలా స్పష్టంగా పడుతుంది. పిండి పదార్థాలు చాలినంతగా లేకపోతే ప్రధానంగా ఒంట్లో శక్తి లోపిస్తుంది. ఫలితంగా బరువు తగ్గి, భౌతికంగా త్వరగా అలసటకు గురవుతాం. ఇది పనిలో సామర్థ్య కొరతకు దారి తీస్తుంది. ఒకవేళ మనం తీసుకొనే ఆహారంలో పిండి పదార్థాలు మరీ ఎక్కువైపోతే దేహంలో అవి కొవ్వుగా మారిపోవడమో లేదా శరీరంలోనే నిలువ వుండడమో జరుగుతుంది. దీన్నిబట్టి వీటితో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం మూలంగా శరీరపరంగా ఎక్కువ బరువు పెరిగిపోతాం. ఫలితంగా మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (హై బీపీ) వంటి వ్యాధులకూ ఇది మరొక రకంగా కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.

281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles