బ్రౌజర్.. షార్ట్‌కట్స్..


Wed,July 31, 2019 12:28 AM

బ్రౌజర్‌లో కొన్ని మెళకువలు తెలిస్తే పని సులభం అవుతుంది. వాటి కోసం ఎన్నో చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని .
tiptop
-తరచూ ఓపెన్ చేసే వెబ్‌సైట్ ట్యాబ్‌లను బ్రౌజర్లో బుక్‌మార్క్ చేసుకుంటాం. అట్లాగే ఆ సైట్ ట్యాబ్‌లను పిన్ చేసుకోవచ్చు. ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేసి పిన్ ట్యాబ్ కొట్టండి. ఎప్పుడూ ఓపెన్ అయి ఉంటుంది.
-హిస్టరీ రికార్డ్ అవకుండా బ్రౌజ్ చేయాలంటే ఇన్‌కోగ్నిటో విండో వాడండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి new incognito tab పై క్లిక్ చేయండి.
-ప్రతిసారీ ఓపెన్ చేసే వెబ్‌సైట్లను హోంపేజీలో షార్ట్‌కట్‌లుగా పెట్టుకోవచ్చు. హోంపేజీలో కనిపించే Add shortcut ద్వారా వీటిని సెట్ చేసుకోవచ్చు.
-ప్రతిసారి మౌస్‌ద్వారా సర్ఫింగ్ చేయలేం. ఈజీగా ఉండడానికి షార్ట్‌కట్ కీస్ ఉపయోగపడతాయి.
-కొత్త ట్యాబ్ ఓపెన్ చేయాలంటే crtl+T, ప్రస్తుత ట్యాబ్‌ను మూసివేయడానికి crtl+W, ఒక ట్యాబ్ నుంచి మరోదానికి వెళ్లేందుకు crtl+tab, ట్యాబ్‌ను బుక్‌మార్క్ చేయడానికి crtl+D, బ్రౌజర్ మొత్తం ఫుల్ స్క్రీన్‌లోకి మారేందుకు F11, సెర్చ్‌బార్ సెలెక్ట్ చేయడానికి F6.

225
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles