యాపిల్ కెమెరా ఇంకా కొత్తగా..


Wed,July 31, 2019 12:34 AM


టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ 2020 ఐఫోన్ మోడల్స్‌లో కొత్త టెక్నాలజీని ఉపయోగించనుంది. కెమెరాకు సంబంధించిన టెక్నాలజీని అప్‌డేట్ చేయనుంది.
something-special
ఇప్పటి వరకూ ఉన్న యాపిల్ ఫోన్ల కెమరాలు వేరే. ఇప్పుడు రాబోతున్న యాపిల్ కెమెరాలు వేరు అని తెలుస్తున్నది. యాపిల్ 2019 లైనప్ ఐఫోన్లలో ToF సెన్సర్ కెమెరా సిస్టమ్ ప్రవేశపెట్టనున్నట్టు వినిపిస్తున్నది. కానీ, ఈ ఏడాదికి సెన్సర్ సిస్టమ్ ఇంకా రెడీ కాలేదని న్యూస్ పోర్టల్ జీఎస్‌ఎమ్ ఏరినా రిపోర్టులో తెలిపింది. క్యూపర్టినో ఆధారిత కంపెనీ కూడా 2020 ఐఫోన్ లైనప్ లో వర్టికల్ కేవిటీ సర్ఫేస్-ఎమిటింగ్ లేజర్ (VCSEL) సిస్టమ్ టెక్నాలజీ ప్రవేశపెట్టేందుకు చేస్తున్నది. ఈ టెక్నాలజీ ద్వారా ఐఫోన్ ఫీచర్లలో ఫేస్‌ఐడీ, Animoji, పోర్ట్రెయిట్ మోడ్ సెల్ఫీలకు అద్భుతంగా పనిచేస్తుంది. 2018లో యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి క్యూయో మాట్లాడుతూ.. ToF త్రిడీ రియర్ కెమెరాలను ఐఫోన్లకు ముందే 2020 ఐప్యాడ్ లతో ప్రవేశపెడతామని ప్రకటించారు. వచ్చే ఏడాదిలో ఆపిల్ కంపెనీ ప్రత్యేకమైన అప్‌గ్రేడెడ్ స్పెషిఫికేషన్లతో 4 ఐఫోన్ మోడల్స్ లాంచ్ చేయనుంది. రాబోయే కొత్త ఐఫోన్లలో OLED స్క్రీన్లు, డిస్‌ప్లే సైజులు 5.4అంగుళాలు, 6.1అంగుళాలు, 6.7 అంగుళాలతో పాటు 5G కనెక్టివిటీ ఉండనుంది. ఇక నాలుగో ఐఫోన్ ఫీచర్ iPhone-8 డిజైన్ మాదిరిగా 5G కనెక్టివిటీ లేదా OLED ప్యానెల్ ఉండనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

266
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles