బడ్జెట్ కంట్రోల్‌కు భలే యాప్స్


Wed,July 31, 2019 12:37 AM

నెల నెలా క్రెడిట్, డెబిట్ అమౌంట్‌కు లెక్క అవసరం. ఖర్చు ఎంత? ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది? దేనికి ఖర్చు పెడుతున్నాం? వీటిపై అంచనా అవసరం. ఈ విషయాలను పొందుపర్చుకోవడానికీ, లిమిట్ దాటితే గుర్తు చేయడానికి కొన్ని యాప్‌లు ఉన్నాయి. రోజు వారి ఖర్చులు, బిల్లులను మేనేజ్ చేయడానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి.
Top
ఆదాయం తక్కువైనప్పుడు ముందుచూపుతో ఖర్చులను తగ్గించాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే లెక్కలు రాసుకుంటాం. ఈ పద్ధతినే మొబైల్ యాప్‌లో కూడా అమలు చేసుకోవచ్చు. మనీ లవర్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది. సేవింగ్స్ మనీ ఆర్గనైజింగ్‌కు ఈ యాప్ ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. సరుకులు, పెట్రోలు, పేపరు, పాల బిల్లులు, టీవీ బిల్లులు, సినిమాలు.. వంటివాటికి అయ్యే ఖర్చులన్నీ దీంట్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడూ మీ బడ్జెట్‌ను స్కాన్ చేస్తూ లిమిట్‌ను బట్టి అలర్ట్ చేస్తుంది. అప్పుడు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వీలవుతుంది.


పర్సనల్ ఫైనాన్స్ యాప్‌లో మంచి రేటింగ్ కలిగిన యాప్ ఇది. మిగిలిన యాప్‌లలాగే రోజు వారీ ఖర్చులను మేనేజ్ చేయడం ఎలాగో తెలియజేస్తుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనం రకరకాల పేమెంట్లు చేస్తుంటాం. ఆ సమయానికి గుర్తులేకపోతే చేయలేం. చేతిలో డబ్బులున్నా కూడా పేమెంట్ డేట్ గుర్తుకు రాకపోవడం వల్ల సకాలంలో చెల్లింపులు జరపలేకపోతాం. అయితే ఈ యాప్‌లో ఒక్కసారి పేమెంట్ల రిమైండర్లను సేవ్ చేసుకోవచ్చు. అదే మనల్ని అలర్ట్ చేస్తుంది.
Top2
ఈ యాప్ కూడా పూర్తిగా ఉచితం. మీకు వస్తున్న ఆదాయం ఎంత? మీరు ఖర్చు చేస్తున్నది ఎంత? ఇక ఎంత మొత్తం బ్యాలెన్సింగ్‌గా ఉన్నారు? అన్న విషయాలను ఎప్పటికప్పుడూ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అందులోనూ డైలీ, వీక్లి, మంథ్లీ ఆర్థిక లావాదేవీలను తెలుసుకునే అవకాశం కూడా ఉంది. మీరు కట్టే ప్రతి బిల్లునూ మొబైలో ఫొటో తీసుకుని ఈ యాప్‌లో దాచుకోవచ్చు. అలా సేవ్ చేసుకున్న బిల్లుల్ని మళ్లీ విభాగాలుగా విభజించి ఎప్పుడు కావాలంటే అప్పుడు డిస్‌ప్లే ఇస్తుంది. ఉదాహరణకు కరెంటు, ఇంటర్నెట్ , మొబైల్ చార్జీలు వంటివన్నీ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ప్రతి రిసిప్టుకు బ్యాకప్ వివరాలు ఉంటాయి. వీటన్నిటితో పాటు యూజర్లు మల్టీ అకౌంట్ల ద్వారా సేవలు పొందవచ్చు. డాలర్లు, పౌండ్లు, దినార్లలో పర్సనల్ బడ్జెట్‌ను నిర్వహించినా.. అది రూపాయలలోకి కన్వర్ట్ చేసుకునే సదుపాయం ఉంది. ట్యాక్స్ క్యాలుకులేటర్ అదనంగా ఉంది.

అన్ని రకాల లావాదేవీలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంకు అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్టిమెంట్లు, ఇన్సూరెన్స్ పాలనీలు, క్రెడిట్, డెబిట్ వివరాలు, లావాదేవీలన్నీ ఈ సైట్ ద్వారా మనకు అందుతాయి. అంటే ఈ యాప్‌లో ఒక్కసారి లాగిన్ అయితే మల్టిపుల్ అకౌంట్ల వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఈ యాప్ నుంచే సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే మిగిలిన యాప్స్ మాదిరి ఇది ఉచితం కాదు. గోల్డ్, ప్రీమియం అనే రెండు వెర్షన్లను అందిస్తున్నదీ సంస్థ. ఏడాదికి అయిదు వందల నుంచి పదిహేను వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది..

జాగ్రత్తలు తప్పనిసరి

Top1
మొబైల్‌లో లావాదేవీలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి పర్సనల్ ఫైనాన్స్ యాప్‌లను జాగ్రత్తగా వాడాలి. యాప్‌లను ఎంచుకొనేటప్పుడు క్రెడిబిలీటీ ఉన్న కంపెనీలు తయారుచేసిన యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. యూజర్లు ఇచ్చిన నెగెటివ్, పాజిటివ్ రివ్యూలు చూడండి. బ్యాంకు అకౌంట్స్ వివరాలు, మరీ ముఖ్యంగా క్రెడిట్ - డెబిట్ కార్డుల పిన్‌నంబర్లు సేవ్ చేసుకోకపోవడం మంచింది. కొన్ని యాప్‌లలో బిల్లులు సేవ్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి మరీ విలువైన డాక్యుమెంట్లు పెట్టవద్దు. ఇలాంటి మనీ మేనేజింగ్ యాప్‌లు కేవలం ఇంటిఖర్చులు, నెల నెలా వచ్చే ఆదాయం, ఇతరత్రా ఖర్చుల జమాలెక్కల నిర్వహణకు మాత్రమే వాడుకోవాలి. ఇవి థర్డ్‌పార్టీ యాప్‌లు. ఒక రకంగా పద్దుల పుస్తకాలనే ఇలా.. మొబైల్లో యాప్స్ రూపంలో వాడుకుంటున్నామని అర్థం.
- వినో..

364
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles