నార్సింగి నుంచి రష్యా దాకా..


Sat,August 3, 2019 12:39 AM

ప్రతికూల పరిస్థితుల్ని చూసి భయపడి.. తనేం చేయలేనని నీరసపడిపోయి.. వెనకడుగు వేస్తే జీవితంలో ఏం సాధించలేమని ఆ యువకుడు భావించాడు. కష్టపడి ఎన్‌ఏసీలో కొత్త నైపుణ్యాల్ని నేర్చుకున్నాడు. రష్యాలో జరిగే ప్రపంచ పోటీలకు సిద్ధమవుతున్నాడు.
RAJIREDDY1
మెదక్ జిల్లా నార్సింగికి చెందిన రాజిరెడ్డి అనే యువకుడు డిగ్రీలోనే చదువు ఆపేశాడు. కుటుంబం కోసం పెట్రోల్ పంపులో చేరాడు. తర్వాత, హైదరాబాద్‌లోని ఎన్‌ఏసీలో డ్రై వాల్ అండ్ ఫాల్స్ సీలింగ్స్‌పై మూడు నెలల శిక్షణను తీసుకున్నాడు. కుటుంబానికి మెరుగైన జీవనాన్ని ఇవ్వడానికి ప్రయతిస్తుండగా.. ఎన్‌ఏసీ నుంచి ముంబైలోని సెయింట్ గోబెయిన్ జిప్రాక్ సంస్థలో చేరాడు. ఆరు నెలల పాటు శిక్షణ తీసుకున్న అనంతరం, అక్కడి స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజర్ ఇమ్మానుయేల్ రాజిరెడ్డికి వరల్డ్ స్కిల్ పోటీలకు సన్నద్ధం కావాలని సూచించారు. దీంతో 2018 మే నుంచి సన్నాహాల్ని మొదలెట్టాడు. దేశవ్యాప్తంగా జరిగిన పోటీల్లో అనేక మందితో పోటీపడి గోల్డ్ మెడల్‌ను సాధించాడు. ప్రస్తుతం రష్యాలో జరిగే ప్రపంచ పోటీలకు సన్నద్ధం అవుతున్నాడు. జిప్సం ప్లాస్టరింగ్, డ్రై వాల్ విభాగంలో అంతర్జాతీయ పోటీల్లో ఇండియా నుంచి పోటిపడుతున్న ప్రప్రథమ యువకుడు రాజిరెడ్డి. రష్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలో విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles