అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?


Sat,August 3, 2019 12:40 AM

దేశమంతటా నిర్మాణ రంగం ఇబ్బంది పడుతున్నది. ఇక్కడ మాత్రం సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. వాణిజ్య సముదాయాలు, రిటైల్ రంగానికి ఎక్కడ్లేని గిరాకీ పెరుగుతున్నది. కాకపోతే, ఆశించిన స్థాయిలో ఫ్లాట్ల అమ్మకాలు మాత్రం పెరగడం లేదు. పైగా, గత కొంతకాలం నుంచి తగ్గుముఖం పట్టింది. మరి, క్రమక్రమంగా ఫ్లాట్ల అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి? ఇందుకు గల కారణాలేమిటి? ప్రమోటర్లు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరమున్నది.
SALES
తెలంగాణలో రెరా అథారిటీ ఏర్పడిన నేపథ్యంలో.. డెవలపర్లు చాలా పక్కగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఎక్కడో ఒక చోట స్థలం తీసుకుని అపార్టుమెంట్ కట్టగానే కొనుగోలుదారులు వచ్చి ఫ్లాట్లు కొంటారనే రోజులు లేవిప్పుడు. ఏయే తరహా ఇండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉందనే విషయాన్ని డెవలపర్లు పక్కాగా అంచనా వేశాకే ప్రాజెక్టులను ప్రారంభించాలి. సేల్స్ అండ్ మార్కెటింగ్ జట్టు చాలా పటిష్ఠంగా ఉండాలి. ఫ్లాట్ల విస్తీర్ణం అందుబాటులో ఉండి, సకాలంలో అందజేస్తామని చెప్పి, నాణ్యతలో ఎక్కడా రాజీపడమని కొనుగోలుదారుల్లో విశ్వాసం కలిగించాలి. పైగా, డెవలపర్లు కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఈ విషయం కొందరు డెవలపర్లకు ప్రస్తుతం అర్థం కాకపోవచ్చు. రెరా అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రతిఒక్క డెవలపర్ తప్పకుండా తమ పంథాను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

-అభివృద్ధికారకమైన ప్రభుత్వం, ప్రోత్సాహాకర విధానాలతో దూసుకెళుతుండటం వల్ల.. భాగ్యనగరంలో వాణిజ్య సముదాయాలకు గిరాకీ పెరుగుతోంది. ఇది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే ప్రసక్తే లేదు. కాబట్టి, హైదరాబాద్ రియల్ రంగానికి రానున్న రోజుల్లో తప్పకుండా ఆదరణ మరింత పెరుగుతుంది. కాకపోతే, గత ఏడాది నుంచి కొందరు ప్రమోటర్లు ఇష్టం వచ్చినట్లు ఫ్లాట్లను రేట్లను పెంచేశారు. కానీ, కొనుగోలుదారుల జీతాలు మాత్రం అంతే స్థాయిలో పెరిగిన దాఖలాల్లేవు. దీంతో, మెల్లిమెల్లిగా కొనుగోలుదారులు ఫ్లాట్లను కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.

123
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles