ఫ్లాట్ మెయింటనెన్స్..పెద్ద న్యూసెన్స్


Sat,August 3, 2019 12:41 AM

KENWORTH
హైదరాబాద్‌లో గేటెడ్ కమ్యూనిటీల సంఖ్య పెరుగుతున్నది. పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఒకే అపార్టుమెంట్‌లో నివసిస్తుండటంతో.. ప్రతి అపార్టుమెంట్ కూడా ఓ మినీ ఇండియా మాదిరిగా తలపిస్తున్నది. ఒకవైపు, ఇది సానుకూలాంశమే అయినప్పటికీ, ఆయా నివాసితుల సంఘంలో చేరే వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తోటి నివాసితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు కలిసి హఠాత్తుగా మెయింటనెన్స్ ఛార్జీలను పెంచడం, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అందులోని నివాసితులు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో, అపార్టుమెంట్లలో ఇష్టం వచ్చినట్లు మెయింటనెన్స్ ఛార్జీలను పెంచవచ్చా?

మన హైదరాబాద్‌లో 1978 నుంచి అపార్టుమెంట్ల నిర్మాణం ఆరంభమైనప్పటికీ.. 1982 తర్వాతే ఊపందుకుంది. ఒకే స్థలంలో కొన్ని కుటుంబాలు కలిసి ఉండేవిధంగా అపార్టుమెంట్లను కట్టుకునే సంప్రదాయాన్ని ప్రజలు నెమ్మదిగా అలవాటు చేసుకున్నారు. వ్యక్తిగత గృహమైతే, ఎవరికి వారే నిర్వహణ చూసుకుంటారు. అయితే, కొద్దిమంది కలిసి ఒకే అపార్టుమెంట్‌లో నివసిస్తే మాత్రం.. నిర్వహణ బాధ్యతల్ని చేపట్టడానికి ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా అపార్టుమెంట్ కట్టిన బిల్డర్ అయినా చేయవచ్చు. లేదా అందులోని గృహయజమానులే కలిసికట్టుగా ఒక సంఘంగా ఏర్పడి నిర్వహణ బాధ్యతను చేపట్టవచ్చు. పెరుగుతున్న అపార్టుమెంట్లను గమనించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1987లో.. అపార్టుమెంట్ యజమానుల సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఆయా ఫ్లాట్లను నిర్వహణ గురించి చర్చించడానికి ప్రత్యేకంగా ఒక సంఘం ఉండాలి. అందులో కనీసం ఏడుగురు సభ్యులుండాలి. అపార్టుమెంట్ నిర్వహణను ఈ సంఘ సభ్యులే చేపట్టాలి. మంచినీరు, విద్యుత్తు, లిఫ్టులు, జనరేటర్.. ఇలా ప్రతీది అందులోని నివాసితులకు సక్రమంగా అందేలా చూడటం ఈ సంఘం ప్రధాన కర్తవ్యం. ఇందులో ఎలాంటి లాభాపేక్ష ఉండకూడదు. ప్రత్యేకంగా బై లాస్ కూడా రాసుకోవాలి. ప్రతిఒక్కరూ దానికి బద్దులై ఉండాలి.

-అపార్టుమెంట్ నిర్మాణ దశలోనే బిల్డర్.. అట్టి యజమానుల నుంచి కొంత సొమ్మును కార్పస్ ఫండ్‌గా వసూలు చేస్తారు. అట్టి సొమ్మును నిర్మాణం పూర్తయ్యాక.. బిల్డర్ సంక్షేమ సంఘానికి అప్పగించాలి. ఆయా సొమ్ముతో సంక్షేమ సంఘం అపార్టుమెంట్ భారీ ఖర్చుల కోసమే వినియోగించాలి. ఉదాహరణకు భవనానికి రంగులేయడం, ఇతర స్ట్రక్చరల్ రిపేర్లు, జనరేటర్లు తీసుకోవడం వంటివి చేయాలి.
చిన్నదైనా.. పెద్దదైనా..
నిర్వహణ బాధ్యతల్ని చేపట్టడానికి ప్రత్యేకంగా సంఘం ఏర్పడాలి. ఇందుకోసం ఏకంగా ఆయా అపార్టుమెంట్‌కి సంబంధించిన ప్రతిఒక్క అంశాన్ని బైలాస్‌లో పొందుపర్చాలి.

ఇష్టారాజ్యంగా పెంచకూడదు..

నివాసితుల సంక్షేమ సంఘం రెండు, మూడు నెలలకోసారి సమావేశం కావాలి. నిర్వహణ ఖర్చుల గురించి చర్చించాలి. మెయింటనెన్స్ సొమ్ము పెంచాలన్నా.. తగ్గించాలన్నా.. సంఘ సభ్యులంతా కలిసి నిర్ణయించాలి. ఆయా అసోసియేషన్‌కి కొత్తగా అధ్యక్షుడు ఎన్నిక కాగానే నిర్వహణ సొమ్ము పెంచకూడదు. తాము రూపొందించుకున్న బైలాస్ ప్రకారం అపార్టుమెంట్ బాధ్యతల్ని నిర్వహించాలి. అంతే తప్ప, అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి వీల్లేదు.

215
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles