ప్రీమియం చూసి ఎంచుకోవద్దు..


Sat,August 3, 2019 12:54 AM

INSURANCE
ప్రీమియం తక్కువ ఉన్నదని బీమా పాలసీలను ఎంచుకోవద్దు. ఆయా సంస్థ క్లెయిముల చెల్లింపు విధానాన్ని చూసి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేకాదు, మీ కుటుంబం జీవన విధానానికి ఎలాంటి భంగం కలిగించని విధంగా ఉండాలి.

టెర్మ్ పాలసీల విలువ ఇప్పుడిప్పుడే చాలామందికి అర్థమవుతుంది. కాకపోతే, అధిక శాతం మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ పాలసీలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలూ విక్రయిస్తుంటాయి. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ ప్రాయోజిత సంస్థలతో పోల్చితే, ప్రైవేటు సంస్థల టెర్మ్ పాలసీల ప్రీమియం రేట్లు తక్కువుంటాయి. అందుకే, వీటిని ఎంచుకోవడానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. ఒకే రకమైన ప్రయోజనాల్ని రెండు సంస్థలు కల్పిస్తుంటే.. వాటి ప్రీమియంను చూసి చాలామంది నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే, ప్రీమియం ఒక్కటే చూడొద్దని నిపుణులు అంటున్నారు. పాలసీని సులువుగా తీసుకోవడం, క్లెయిముల చెల్లింపు విధానం, పాలసీ ప్రత్యేకతలేమిటి? వంటి అంశాల్ని గమనించాలి. ఎల్‌ఐసీ సుమారు 98 శాతం దాకా క్లెయిములను పరిష్కరిస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అందుకే, ప్రీమియం బెడదను తప్పించుకోవడానికి తక్కువ కాలానికి పాలసీని తీసుకోవద్దు. అది గడిచిన తర్వాత, కొత్త ప్లాన్‌ను ఎంచుకోవడానికి అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని మర్చిపోవద్దు.

124
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles