ఎవరెంత పన్ను కట్టాలి ?


Sat,August 3, 2019 01:04 AM

tax1
పన్ను విషయానికిస్తే రకరకాల సందేహాలు పట్టిపీడిస్తుంటాయి. ఉద్యోగులే కాదు మహిళలు, వృద్ధుల్లోనూ ఈ తరహా సందేహాలు సర్వసాధారణమే. ఇలాంటి ఇబ్బందుల్ని గమనించిన నిధి.. ఎవరెంత పన్ను శాతం కట్టాలి? సర్‌ఛార్జీ, ఆరోగ్య, విద్యాసెస్సు శాతమెంత? మొత్తానికి ఎంత పన్ను కట్టాలనే విషయంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నది. ఏడాదికి ప్రతిఒక్కరూ కట్టాల్సిన నికర పన్ను శాతమెంతో ఈ పట్టిక చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
tax

గుర్తుంచుకోండి..

ఏడాదికి రూ.2.5 లక్షలు ఆర్జించే వ్యక్తులు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. అదే రూ. 2.51 లక్షల నుంచి రూ.5 లక్షలను ఆర్జించేవారు ఐదు శాతంతో పాటు ఆరోగ్య, విద్యా సెస్సు నాలుగు శాతాన్ని కలుపుకుంటే, మొత్తం 5.20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 నుంచి 10 లక్షల వరకూ ఆదాయాన్ని ఆర్జించేవారు మొత్తం 20.80 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.
- 60 ఏండ్లలోపు వయస్సు కలిగి పన్ను పరిధిలోకి వచ్చే రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రూ.12,500 దాకా పన్ను రిబేటు లభిస్తుంది.
- రూ. 5 లక్షల కంటే అధిక పన్ను ఆదాయముంటే సెక్షన్ 89ఏ కింద రిబేటు లభించదు
- పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.50 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఉంటే 10 శాతం అదనపు ఛార్జీలుంటాయి.
- పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 1 కోటి పైన ఉంటే పన్ను మొత్తంలో 15 శాతం అదనపు ఛార్జీలు ఉంటాయి.
- ఆరోగ్యం, విద్యా సెస్సు పన్ను మొత్తం అదనపు ఛార్జీపై 4 శాతం ఉంటుంది.

- గంధం శివకృష్ణ, ఛార్టెడ్ అకౌంటెంట్

305
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles