ఆరోగ్య బీమా అందుకోండిలా..


Sat,August 3, 2019 01:06 AM

HEALTH-POLICY
ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితం.. సమయానికి సరైన తిండి కూడా తినకుండా.. లక్ష్యాలను చేరుకోవడానికి పరుగు పెట్టేవారి సంఖ్య తక్కువేం కాదు. బాసులు నిర్ణయించిన టార్గెట్లను అందుకోవడం మీద పెట్టేంత శ్రద్ధ.. ఆరోగ్య పాలసీని తీసుకోవడంలో పెడితే కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది.


ఉద్యోగులైనా.. వ్యాపారులైనా.. నిదానంగా ఓసారి కూర్చోని ఆలోచించాలి. కాస్త యుక్త వయసులో సమయంతో పోటీపడి లక్ష్యాలను చేరుకోవడానికి పరుగులు పెడతారు. ఇలా పరుగులు పెట్టే క్రమంలో పొరపాటున ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే మాత్రం.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అవుతాయి. భవిష్యత్తులో ఏదో జరుగుతుందని చెప్పడం కాదు కానీ.. అనుకోకుండా ఏర్పడే విపత్తు నుంచి మన జీవితాన్ని, మన కుటుంబ సభ్యులను రక్షించుకోవాలి. అందుకే, ఉద్యోగం చేసే ప్రతిఒక్కరూ ఆరోగ్య బీమా పాలసీని తప్పకుండా తీసుకోవాలి. మరి, ఇందుకోసం ఏయే అంశాలపై అధిక దృష్టి సారించాలంటే..

ఇరవై ఏండ్లలో..

మనలో చాలామంది ఉద్యోగంలో చేరిన నాటి నుంచే ఆరోగ్య పాలసీని తీసుకుంటారు. 75 శాతానికి పైగా యువకులు కేవలం పన్ను రాయితీ కోసం ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 70 శాతానికి పైగా భారతీయులు ఆస్పత్రి ఖర్చులను తమ జేబులో నుంచి పెడుతుంటారు. పన్ను రాయితీని అటు ఉంచితే, ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే వారు పలు అంశాలపై పక్కాగా దృష్టి సారించాలి.

- ఉద్యోగంలో చేరిన తర్వాత.. ఆస్పత్రిలో చేరే అవసరం రాదనుకోకూడదు. పొరపాటున డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధి బారిన పడి.. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. ఖర్చు తడిసిమోపెడు అవుతుంది. కాబట్టి, ఆరోగ్య పాలసీ తీసుకునేటప్పుడు ఆస్పత్రి ఖర్చులు భరించేలా ఉండాలి. ప్రమాదం జరిగినా చికిత్స లభించేలా చూసుకోవాలి.

ముప్పై వచ్చిందా?

ఇరవై నుంచి ముప్పయ్ ఏండ్లలోపు పెళ్లి చేసుకుంటే గనక.. మీ వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా.. కుటుంబం గురించీ ఆలోచించాలి. కాబట్టి, ఆరోగ్య పాలసీలో కొన్ని చికిత్సలుండేలా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు, మొత్తం కుటుంబానికి కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్ రక్షణ ఉండాలి. ఈ వయసులోనే సాధారణంగా పెళ్లి చేసుకునేవారు ఎక్కువ కాబట్టి.. మెటర్నటీ కవర్ ఉంటే ఉత్తమం. పండంటి బిడ్డ పుట్టిన తర్వాత.. ఎలాంటి చికిత్సకైనా అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తపడాలి.

- మనం పని చేసే సంస్థలిచ్చే ఆరోగ్య పాలసీలు కొన్ని సందర్భాల్లో కుటుంబానికి పూర్తి భరోసాను ఇవ్వకపోవచ్చు. కాబట్టి, ఆ తేడా ఎంతుందో చూసి అదనపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ కోసం సొంతంగా తీసుకుంటే ఉత్తమం. ఒకవేళ, పాలసీ తీసుకున్నాక.. దానిని వినియోగించుకోకపోతే.. మరుసటి ఏడాదిలో నో క్లెయిమ్ బోనస్ రాయితీని పొందవచ్చు. ఇది ప్రీమియం మొత్తం తగ్గడమో లేదా పాలసీ మొత్తం పెంచుకోవడమో చేయవచ్చు.

895
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles