కోమల చర్మానికి..


Mon,August 5, 2019 01:12 AM

ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకూ అమ్మాయిలు అందం విషయంలో రాజీపడరు. మరి క్లియర్ చర్మం కావాలంటే కొంత శ్రద్ధ అవసరం. అందుకే ఏఏ చిట్కాలు పాటిస్తే కోమలమైన చర్మం సొంతం చేసుకోవచ్చో చదువండి.
chit-sun
-కొద్దిగా వేపనూనెలో, ఒక చెంచా నిమ్మరసం వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను నివారిస్తాయి.
-అవకాడో గుజ్జులో, టమాటా గుజ్జు కలుపాలి. దీంట్లో కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి రాయాలి. పావుగంట పాటు ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-దాల్చినచెక్క పొడి, తేనె, పసుపు సమపాళ్లలో తీసుకొని ముఖానికి, మెడకు రాయాలి. పావుగంట పాటు వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
-పొప్పడి పండు గుజ్జులో రోజ్‌వాటర్, క్యాబేజీ జ్యూస్‌ని కలుపాలి. దీన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే ముఖంపై ఉన్న నల్లమచ్చలు తొలిగిపోతాయి.
-క్యారెట్లలో ఉండే విటమిన్ సి, బీటాకెరోటిన్ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది. కాబట్టి క్యారెట్ గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత కడిగేయాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు రాస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.

532
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles