పాలపుంత త్రిమితీయ పటం


Tue,August 6, 2019 12:24 AM

భూమికి ఆవాసమిచ్చిన పాలపుంతకు చెందిన కొత్త త్రిమితీయ (త్రీడీ) చిత్రాన్ని శాస్త్రజ్ఞులు ఆవిష్కరించారు. విశ్వరహస్యాల శోధనకు ఇదెంతో ఉపయుక్తమని వారంటున్నారు.
Vishwa
సూర్యునినుండి మహానక్షత్రాల సముదాయమైన సెఫీడ్ (Cepheid) తారలవరకూ గల దూరం ఆధారంగా మన గెలాక్సీ (పాలపుంత: Milky Way) విస్తృత పటాన్ని శాస్త్రవేత్తలు తాజాగా త్రిమితీయ (3D: Three-dimensional) రూపంలో ఆవిష్కరించారు. దీనికి సరికొత్త ప్రామాణిక పద్ధతిని అవలంభించినట్లు వారు చెబుతున్నారు. అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ, పోలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వార్సా (University of Warsaw): అస్ట్రానమికల్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచిన ఈ పరిశోధనా పత్రం ఇటీవల సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆప్టికల్ గ్రావిటేషనల్ లెన్సింగ్ ఎక్స్‌పర్‌మెంట్ (OGLE), ఆల్ స్కై ఆటోమేటెడ్ సర్వే ఫర్ సూపర్‌నోవా (ASAA-SN) చిత్రీకరించిన చిత్రాల ఆధారంగా వారు ఈ అధ్యయనం జరిపారు. ఈ సందర్భంగా మొత్తం 2,431 సెఫీడ్ నక్షత్రాల సముదాయాన్ని విశ్లేషించినట్టు చెబుతున్నారు. ఇదివరకంటే ఎంతో విస్తృత దూరం ప్రాతిపదికన ప్రస్తుత త్రిమితీయ పటం (చిత్రం) రూపొందిందని, దీనితో మన పాలపుంత సమతలంగా లేదని, కొంత వొంపుతో, మలుపు తిరిగి ఉందన్నది నిరూపితమైందనీ వారు తెలిపారు.

368
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles